Bofors Scam: బోఫోర్స్‌ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్

మైఖెల్ హెర్ష్‌మన్‌ ఒక ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌. ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌‌‌ను(Bofors Scam) ఈయనే నడుపుతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Bofors Scam Cbi Judicial Request Us Trump India

Bofors Scam: రాజీవ్‌గాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బోఫోర్స్‌ కుంభకోణం జరిగింది. దానిపై మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఫోకస్ పెట్టింది. ఈ కేసుకు సంబంధించి అమెరికాలోని ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌ మైఖెల్ హెర్ష్‌మన్‌ నుంచి కీలక సమాచారాన్ని సేకరించేందుకు అమెరికా సాయాన్ని సీబీఐ కోరింది. మైఖెల్ హెర్ష్‌మన్‌ నుంచి ఆధారాలను తీసుకునేందుకు అనుమతి కావాలంటూ అమెరికాలోని కోర్టుకు భారత సీబీఐ న్యాయపరమైన రిక్వెస్ట్ పంపింది. అమెరికా కోర్టుకు సీబీఐ లెటర్‌ రొటేటరీని పంపింది. కేసులను  దర్యాప్తు చేయడంలో సహకారాన్ని కోరుతూ ఒక దేశంలోని కోర్టు, మరో దేశంలోని కోర్టుకు లిఖిత పూర్వకంగా పంపే అభ్యర్థననే  లెటర్‌ రొటేటరీ (ఎల్‌ఆర్‌) అంటారు. దీన్ని అమెరికా కోర్టుకు పంపేందుకు ఈ ఏడాది జనవరి 14న సీబీఐకి భారత హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీన ఎల్‌ఆర్‌ను అమెరికా కోర్టుకు పంపారు. అమెరికా కోర్టు వైపు నుంచి స్పందన రావాల్సిఉంది.

Also Read :Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్‌.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ

ఎవరీ మైఖెల్ హెర్ష్‌మన్‌  ?

  • మైఖెల్ హెర్ష్‌మన్‌ ఒక ప్రైవేటు ఇన్వెస్టిగేటర్‌. ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌‌‌ను(Bofors Scam) ఈయనే నడుపుతుంటారు.
  • 2017లో భారత్‌లో మైఖెల్ పర్యటించారు. అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బోఫోర్స్ కేసును పక్కదారి పట్టించేందుకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం యత్నించిందని ఆనాడు మైఖెల్ ఆరోపించారు. దీనితో ముడిపడిన ఇన్ఫర్మేషన్‌ను ఇచ్చేందుకు తాను రెడీ అన్నారు.
  • ఆనాడు మైఖెల్‌ చేసిన ఆరోపణలను సీబీఐ సుమోటోగా స్వీకరించింది. దానిపై ఆయన నుంచి సమాచారాన్ని సేకరించేందుకే  ఇప్పుడు  అమెరికా అధికారుల అనుమతిని సీబీఐ కోరింది.

Also Read :Pawan : పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ – జగన్

ఏమిటీ స్కాం..

  • ఎ.బి.బోఫోర్స్ అనేది స్వీడన్‌కు చెందిన ఒక కంపెనీ పేరు. ఆ కంపెనీ 155 ఎం.ఎం. హోవిట్జర్‌ గన్లను తయారు చేసేది.
  • రూ.1,437 కోట్లతో దాదాపు 400  ఎం.ఎం. హోవిట్జర్‌ గన్ల కొనుగోలుకు సంబంధించి 1986 మార్చి 24న ఎ.బి.బోఫోర్స్ కంపెనీతో నాటి భారత సర్కారు డీల్ కుదుర్చుకుంది.
  • ఈ డీల్ వ్యవహారంలో రూ.64 కోట్లు చేతులు మారాయంటూ 1987 ఏప్రిల్‌ 16న స్వీడిష్‌ రేడియో ఒకటి వార్తను ప్రసారం చేసింది.
  • తదుపరిగా 1990 జనవరి 22న బోఫోర్స్ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదైంది.
  • బోఫోర్స్‌ కంపెనీ అధ్యక్షుడు మార్టిన్‌ ఆర్డ్‌బో, మధ్యవర్తులుగా వ్యవహరించిన విన్‌ చద్దా, హిందూజా సోదరులు, ఇటలీకి చెందిన ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణశాఖ కార్యదర్శి ఎస్‌.కె.భట్నాగర్‌లపై  రెండు విడతల్లో ఛార్జ్‌షీట్లను దాఖలు చేశారు.
  • ఈ కేసు దర్యాప్తునకు ఇప్పటిదాకా రూ.250 కోట్లు ఖర్చు చేశారు.
  • కుంభకోణం విలువ కన్నా, దర్యాప్తు వ్యయమే ఎక్కువ ఉందంటూ ఈ కేసును 2005లో ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. లంచాలు ఇచ్చినట్లు సీబీఐ నిరూపించలేకపోయిందని తెలిపింది.
  • ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2018లో సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. 13 ఏళ్ల తర్వాత అప్పీలు చేయడం సరికాదంటూ దాన్ని అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
  • 2005లోనే అజయ్‌ అగర్వాల్‌ అనే న్యాయవాది అప్పీల్‌ చేయగా, ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ కొనసాగుతోంది.
  Last Updated: 05 Mar 2025, 03:41 PM IST