CBI : సీబీఐ మా కంట్రోల్‌లో లేదు.. సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం

CBI :  కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

  • Written By:
  • Updated On - May 2, 2024 / 04:16 PM IST

CBI :  కేంద్ర ప్రభుత్వం కీలకమైన విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) తమ నియంత్రణలో లేదని కేంద్రంలోని మోడీ సర్కారు గురువారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపింది. ముందస్తు అనుమతి లేకుండానే సీబీఐ పశ్చిమ బెంగాల్‌లో కేసులు నమోదు చేసి దర్యాప్తులు చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131ని కేంద్ర సర్కారు ఉల్లంఘిస్తోందని దీదీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ  పిటిషన్‌పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నది.

We’re now on WhatsApp. Click to Join

ఈక్రమంలో  కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేసులను కూడా నమోదు చేయలేదు. ఆ కేసులను సీబీఐ నమోదు చేసింది. సీబీఐ మా నియంత్రణలో లేదు’’ అని కోర్టుకు తెలిపారు. ఇక బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జులై నెలకు  వాయిదా వేసింది.ఇటీవల సందేశ్‌ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు సమాచారాన్ని బెంగాల్ ప్రభుత్వానికి ఇవ్వడం లేదని టీఎంసీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Also Read : 400 Paar : ఈసారి బీజేపీకి 200 సీట్లు కూడా అతికష్టమే.. శశిథరూర్ జోస్యం

వాస్తవానికి 2018 నవంబర్‌ 16న బెంగాల్‌ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి దర్యాప్తు చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. దాంతో బెంగాల్‌లో సీబీఐ దాడులు జరగలేదు. ఇటీవల ఈడీ బృందంపై జరిగిన దాడిని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సందేశ్‌ఖాలీలో అక్రమ భూకబ్జాలు, తదితర కేసులపై సీబీఐ విచారణ జరుపుతుండటంతో.. బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీబీఐ పనిచేస్తోందని దీదీ సర్కారు ఆరోపిస్తోంది. అయితే తమకేం సంబంధం లేదని, సీబీఐ స్వతంత్ర సంస్థ అని కేంద్రంలోని మోడీ సర్కారు వాదిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. బీజేపీ పాలిత రాష్ట్రాలపై సీబీఐ ఎందుకు రైడ్స్ చేయడం లేదు ? అనేది ఎవరికీ  సమాధానం దొరకని ప్రశ్న !!

Also Read : Disruptor: కేవ‌లం రూ. 500తోనే బైక్‌ను బుక్ చేసుకోండిలా..!