Bharatpol : ‘భారత్‌పోల్’ పేరుతో సరికొత్త వేదికను సీబీఐ ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పోలీసు విభాగం ‘ఇంటర్ పోల్’తో సమన్వయం చేసుకోవడమే ‘భారత్ పోల్’(Bharatpol) పని. భారత్‌లో జరిగిన నేరాలు, కుంభకోణాల దర్యాప్తు.. నిందితులు, నేరస్తుల సమాచారం వంటి విషయాల్లో ఇంటర్ పోల్‌తో కలిసి భారత్ పోల్ పనిచేయనుంది. పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనుంది. భారత్ నుంచి విదేశాలకు పరారైన నిందితులను పట్టుకునే క్రమంలో ‘భారత్‌పోల్’ తగిన సహాయ సహకారాలను పొందుతుంది. ఇంటర్‌పోల్ సంబంధిత వ్యవహారాలను భారత్ తరఫున సీబీఐ పర్యవేక్షిస్తుంది. ఈ అంశాల్లో ఇకపై సీబీఐ తరఫున నోడల్ ఏజెన్సీగా భారత్ పోల్ పనిచేస్తుంది. అంటే ఇంటర్ పోల్‌తో నేరుగా భారత్ పోల్ కమ్యూనికేట్ అవుతుంది.
Also Read :Pushpa 2 The Rule : ‘‘పుష్ప 2 ది రూల్’’.. రూ.700 కోట్ల క్లబ్‌లోకి హిందీ వర్షన్.. ఈ లిస్టులోని ఇతర చిత్రాలివీ
ఈక్రమంలో నిందితులను పట్టుకునేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేయిస్తారు. ఆచూకీ లభించని వారి కోసం ఎల్లో కార్నర్ నోటీసులు జారీ చేయిస్తారు. నిందితుల గుర్తింపు, నివాసం వంటి సమాచారం కోసం బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేయిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, కేంద్ర సంస్థల నుంచి ఇంటర్ పోల్‌కు వెళ్లే విజ్ఞప్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత్ పోల్ సహాయ సహకారాలను అందిస్తుంది.
Also Read :WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
భారత్ పోల్ నుంచి ఇంటర్ పోల్‌కు ఈ-మెయిల్, ఫ్యాక్స్, లేఖల ద్వారా పరస్పర సమాచార మార్పిడి జరుగుతుంది. దీనివల్ల ప్రాసెసింగ్ సమయం తగ్గడంతోపాటు ప్రతి కేసు అప్‌డేట్‌ను తేలికగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. సీబీఐ అంతర్గతంగా రూపొందించిన భారత్ పోల్ ప్రాజెక్టు ప్రస్తుతం ట్రయల్స్ మోడ్‌లో ఉంది. దీన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జనవరి 7న ప్రారంభించే అవకాశం ఉంది. ఇంటర్‌పోల్ సాయంతో 2021 సంవత్సరం నుంచి ఇప్పటివరకు వాంటెడ్ జాబితాలో ఉన్న దాదాపు 100 మందికిపైగా నేరస్తులను భారత్‌కు తీసుకొచ్చారు. 2024లో ఇప్పటివరకు 26 మందిని ఇండియాకు తీసుకొచ్చారు.