Site icon HashtagU Telugu

Leader of the Opposition : ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ.. ఏయే పవర్స్ ఉంటాయో తెలుసా ?

Leader Of The Opposition

Leader of the Opposition : పదేళ్ల గ్యాప్ తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. 18వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. రూల్స్ ప్రకారం.. లోక్ సభలోని మొత్తం 10 శాతం సీట్లు గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈసారి 99 సీట్లను కాంగ్రెస్ గెల్చుకోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కైవసం అయింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేతను(Leader of the Opposition) షాడో ప్రధానిగా అభివర్ణిస్తారు. ఇంతకీ ఎందుకు అలా ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రతిపక్ష నేత పవర్స్ ఇవీ.. 

  • కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేసినా, లోక్‌సభలో బలాన్ని నిరూపించుకోవడంలో విఫలమైనా.. పరిపాలనను చేపట్టడానికి ప్రతిపక్ష నేత సిద్ధంగా ఉంటారు. అందుకే లోక్‌సభలో ప్రతిపక్ష నేతను షాడో ప్రధానిగా అభివర్ణిస్తుంటారు.
  • ప్రతిపక్ష నేత లోక్‌సభలో స్పీకర్‌కు ఎడమవైపున ముందు వరుసలో ఉండే సీటులో కూర్చుంటారు.
  • ప్రతిపక్ష నేతకు కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది.
  • కొన్ని సందర్భాలలో ప్రతిపక్ష నేతకు ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి.
  • కొత్తగా ఎన్నికైన సభాపతిని ఆయన సీటు వరకు తీసుకెళ్లడం, పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ముందు వరుసలో కూర్చునే అవకాశం ప్రతిపక్ష నేతకు దక్కుతుంది.

Also Read :500 Employees Layoff : ఆ బ్యాంకు బ్యాడ్ న్యూస్.. 500 మంది ఉద్యోగుల తొలగింపు

  • అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేతకు తప్పనిసరిగా ఆహ్వానం పంపుతారు.
  • 1977 పార్లమెంటు ప్రతిపక్ష నాయకుల జీతభత్యాల చట్టం ప్రకారం ప్రతిపక్ష నేతకు సౌకర్యాలు, జీతం లభిస్తాయి.
  • లోక్‌పాల్, సీబీఐ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫరేషన్ కమిషనర్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ తదితర కీలక నియామకాల కమిటీలో లోక్‌సభా విపక్ష నేత సభ్యుడిగా ఉంటారు.
  • 16వ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత పదవి సాధించేందుకు నిర్ణీత సంఖ్యాబలం (10 శాతం) సాధించలేకపోయింది. దీంతో లోక్‌పాల్ నియామక కమిటీ సమావేశానికి రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. అయితే ఆయన ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.
  • 16, 17 సభలలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా 44, 52 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు.

Also Read :Lok Sabha Speaker : స్పీకర్‌జీ.. ఈసారి ఎంపీల సస్పెన్షన్ పర్వం జరగొద్దు : అఖిలేష్