Cashless Treatment : రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే దిశగా కేంద్రంలోని మోడీ సర్కారు ముందడుగు వేసింది. వారికి నగదు రహిత చికిత్సను అందించేందుకు స్పెషల్ స్కీంను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనౌన్స్ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం ఇస్తేనే నగదు రహిత చికిత్సను పొందొచ్చన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడే వారు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే.. ఏడు రోజుల వైద్యఖర్చుల్లో గరిష్ఠంగా రూ.1.50 లక్షల దాకా ప్రభుత్వమే భరిస్తుందని గడ్కరీ చెప్పారు. ఇక హిట్ అండ్ రన్ కేసుల్లో(Cashless Treatment) మరణించే వారి కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందిస్తామని తెలిపారు.
Also Read :Tibet Earthquake : టిబెట్ భూకంపం.. 150 దాటిన మరణాలు.. 300 మందికి గాయాలు
గడ్కరీ ఇంకా ఏం చెప్పారంటే..
- 2024 సంవత్సరంలో దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.80 లక్షల మంది చనిపోయారు.
- 30వేల రోడ్డు ప్రమాద మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే జరిగాయి.
- రోడ్డు ప్రమాదాల బారినపడిన వారిలో దాదాపు 66 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపు వారే.
- గతేడాది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 10వేల మంది పిల్లలు కూడా ఉన్నారు. విద్యాసంస్థల వద్ద సరైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు లేక ఈ ప్రమాదాలు జరిగాయి.
- ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం కఠిన నియమాలను అమలు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించారు.
Also Read :Assam Coal Mine: తొమ్మిది మంది బొగ్గుగని కార్మికులు బతికేనా ? 2 రోజులుగా 100 అడుగుల లోతున !
- ఆధార్ నంబర్ ద్వారా డ్రైవర్ల సమాచారాన్ని క్రోడీకరించే టెక్నాలజీని రెడీ చేస్తున్నామని గడ్కరీ వెల్లడించారు. అది అందుబాటులోకి వస్తే ఒక డ్రైవరు ప్రతిరోజూ 8 గంటలకు మించి వాణిజ్య వాహనాన్ని డ్రైవింగ్ చేయడం కుదరదని ఆయన తెలిపారు.
- రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎవరైనా రక్షిస్తే వారికి రూ.5వేల నగదు పారితోషికాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.
- భారతదేశంలో నిపుణులైన డ్రైవర్ల కొరత ఉందని గడ్కరీ చెప్పారు. ఇంకా 22 లక్షల మంది స్కిల్డ్ డ్రైవర్లు మన దేశానికి అవసరమని చెప్పారు. దేశంలోని 75 శాతం రవాణా వ్యాపారాలకు స్కిల్డ్ డ్రైవర్ల కొరత వల్ల ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు.
- దేశంలో 100 ట్రక్కులు ఉంటే.. 75 మందే డ్రైవర్లు అందుబాటులో ఉన్నారని గడ్కరీ పేర్కొన్నారు.