Kirti Chakra : అమర సైనికుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమాన్ తల్లి మంజుదేవి, కోడలు స్మృతి అందుకున్నారు. తాజాగా తమ కోడలిపై తల్లిదండ్రులు మంజుదేవి, రవిప్రతాప్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమ కుమారుడి 13వ దినాల కార్యక్రమం ముగియగానే కోడలు ఇంటి నుంచి వెళ్లిపోయిందని వారు తెలిపారు. కనీసం తమ కుమారుడికి వచ్చిన కీర్తి చక్ర పురస్కారాన్ని టచ్ చేసే అవకాశాన్ని కూడా కోడలు ఇవ్వలేదని మంజుదేవి వాపోయారు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావొద్దని ఆమె చెప్పారు. కోడలు ప్రేమగా మసులుకొని.. కొన్ని రోజులు తమతో గడిపి.. ఆ అవార్డును తీసుకెళ్లిపోయి ఉంటే తమకు ఇంత బాధ కలిగేది కాదని మంజుదేవి తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
కెప్టెన్ అన్షుమాన్ సింగ్ సియాచిన్‌లో సైనిక విధులు నిర్వర్తించే వారు. ఆయనొక డాక్టర్. సియాచిన్‌లో విధులు నిర్వర్తించే సైనికులకు అన్షుమాన్ చికిత్స అందించేవారు. 2023 సంవత్సరం జులై 19న తన సహచరులను కాపాడే క్రమంలో ఆయన అమరుడు అయ్యారు. అందుకే అన్షుమాన్‌కు కేంద్ర సర్కారు కీర్తిచక్ర(Kirti Chakra) అవార్డును ప్రకటించింది. అన్షుమాన్‌ను తలుచుకొని ఆయన తల్లి మంజుదేవి ఎమోషనల్ అవుతున్నారు. ‘‘అన్షుమాన్ నా వల్లే డాక్టర్ అయ్యాడు. నా కొడుకుకు గుర్తుగా ఇప్పుడు లూసీ అనే కుక్కపిల్ల మా ఇంట్లో మిగిలింది. ఆ కుక్కపిల్లను అన్షుమాన్ బాగా చూసుకునేవాడు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
Also Read :Stray Dogs Bill : షెల్టర్లలోకి 40 లక్షల వీధి కుక్కలు.. సంచలన ప్రతిపాదన
వాస్తవానికి 5 నెలల క్రితమే అన్షుమాన్‌తో స్మృతికి పెళ్లయింది. వారికి సంతానం కలగలేదు. ఇలాంటి పరిస్థితులు, సందర్భాలు ఉన్నప్పుడు అమర సైనికులు వచ్చే అవార్డులను తల్లిదండ్రులకే ఇవ్వాలని అన్షుమాన్ తండ్రి రవిప్రతాప్ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆర్మీకి చెందిన నెక్ట్స్ టు కిన్ నిబంధనల్లో మార్పులు చేయాలని ఆయన కోరుతున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి దీనిపై రిక్వెస్టు చేశానని రవిప్రతాప్ చెబుతున్నారు. కీర్తిచక్ర అందుకున్నాక కోడలు స్మృతి తన దారిని తాను చూసుకోవడం తమకు(Anshuman Singh Parents) తీవ్ర వేదనను మిగిల్చిందన్నారు.