Site icon HashtagU Telugu

CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రకటన

How To Apply CAA

Caa In 7 Days

CAA Rules : వివాదాస్పదంగా మారిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (CAA) వచ్చే నెల రెండోవారం నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మార్చి నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా  దీనిపై కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు విడుదల చేయనుందని సమాచారం.  వాస్తవానికి  2019 డిసెంబరులోనే  ‘పౌరసత్వ సవరణ చట్టం’ (CAA)కు సంబంధించిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల క్రితమే సీఏఏ అనేది చట్టరూపం దాల్చింది. అయితే దాని అమలుకు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై  చేయలేదు. ఇప్పుడు నిబంధనలను నోటిఫై చేసి.. అమల్లోకి తేనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

పౌరసత్వానికి అర్హతను నిరూపించుకోవడానికి సమర్పించాల్సిన ఆధారాలు, పత్రాల వివరాలతో కూడిన నియమాలను ‘పౌరసత్వ సవరణ చట్టం’ (CAA) తెలియజేస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే  ముస్లిమేతర వలసదారులు భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సీఏఏ అనుమతిస్తుంది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా హిందూ, సిక్కు, క్రిస్టియన్, పార్సీ, జైన్, బౌద్ధ వర్గాలకు చెందినవారే అయి ఉండాలి.  ఈ మూడు ఇస్లామిక్ దేశాలలో ఈ కమ్యూనిటీలు మతపరమైన హింసను ఎదుర్కొన్నారనే భావనతో వారికి భారత్‌లో పౌరసత్వాన్ని కల్పించాలని మోడీ సర్కారు నిర్ణయించింది. అయితే ఈ జాబితా నుంచి కేవలం ముస్లింలను మినహాయించడంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  ఇది మతపరమైన వివక్షే అని ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకించి పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడిన ముస్లిమేతరులలో కొందరు ఇటీవల కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు, గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన ఘటనలు కలవరం రేకెత్తిస్తున్నాయి. అందుకే ఈ చట్టం(CAA Rules) దుర్వినియోగం అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : Fastest T20I Hundred: విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచ‌రీ..!

2014 డిసెంబరు 31కి ముందు పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ లేదా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా  కేంద్ర సర్కారు వచ్చే నెలలో విడుదల చేయనుంది. CAA ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తులను స్వీకరించేందుకు సమయ పరిమితి విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే సమయాన్ని మూడు నెలలకు పరిమితం చేయాలని కేంద్ర హోం శాఖను  అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో కోరింది. ఒక టైం లిమిట్‌ను పెట్టకపోతే తమ రాష్ట్రంలో CAAపై ఆందోళనలు పెరుగుతాయని అస్సాం సర్కారు భావిస్తోంది. ఇటీవల పలువురు కేంద్ర మంత్రులు కూడా సీఏఏపై కీలక ప్రకటనలు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌‌పై ప్రకటన రాకముందే సీఏఏను అమల్లోకి తెస్తారని అనౌన్స్ చేశారు.

Also Read :Shreyas Iyer: కేకేఆర్ జ‌ట్టుకు గుడ్ న్యూస్‌.. గాయం నుంచి కోలుకున్న అయ్య‌ర్..!

2023 డిసెంబర్ 26న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇలా అన్నారు.. “దీదీ (ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ) తరచుగా CAA గురించి మన శరణార్థ సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. CAA అనేది భూమి యొక్క చట్టం. దానిని ఎవరూ ఆపలేరని నేను స్పష్టం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ పౌరసత్వం పొందబోతున్నారు. ఇది మా పార్టీ నిబద్ధత’’ అని చెప్పారు.