Blackmail : ముంబైలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. సీఏగా మంచి ఉద్యోగం చేస్తూ జీవితం సాగిస్తున్న 32 ఏళ్ల రాజ్ లీలా మోరే జీవితాన్ని ఇద్దరు వ్యక్తులు నాశనం చేసినట్టు తెలుస్తోంది. రాజ్ మోరేకు సంబంధించిన ఓ వ్యక్తిగత వీడియోను సంపాదించిన రాహుల్ పర్వానీ, సబా ఖురేషీ అనే ఇద్దరు, ఆ వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ అతనిని గత 18 నెలలుగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఈ సమయంలో రూ.3 కోట్లకుపైగా నగదు తీసుకోవడమే కాకుండా, విలాసవంతమైన కారును కూడా లాక్కున్నారని సమాచారం.
Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు – భట్టి
ఈ అఘాయిత్యాలతో తీవ్ర ఒత్తిడికి లోనైన రాజ్ మోరే, మంగళవారం విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటనాస్థలంలో మూడు పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో రాహుల్, సబాల పేర్లను వెల్లడించి వారే తన మరణానికి కారణమని స్పష్టంగా రాశారు. “వాళ్లు నా సొంత డబ్బుతోపాటు కంపెనీ ఖాతా నుంచే కూడా డబ్బు తీసుకునేలా చేశారు” అని పేర్కొన్నారు. నోట్‌లో తల్లికి క్షమాపణ చెప్పిన రాజ్, తన సహోద్యోగులైన దీపా లఖానీ, శ్వేత, జైప్రకాశ్‌లను ప్రస్తావిస్తూ.. “దీపా నమ్మకాన్ని వమ్ము చేశాను, శ్వేత, జైప్రకాశ్ నిర్దోషులు.. వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకండి” అంటూ తన బాధను వ్యక్తం చేశారు.
రాజ్ మోరే తల్లి తెలిపిన వివరాల ప్రకారం, కొంతకాలంగా తన కుమారుడు తీవ్రమైన ఒత్తిడిలో జీవిస్తున్నాడని తెలిపారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు రాహుల్ పర్వానీ, సబా ఖురేషీలపై బలవంతపు డబ్బుల వసూళ్లు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Cyber Crime : ట్రాఫిక్ చలానా పేరుతో మాజీ ఆర్మీ అధికారిని మోసగించిన నేరగాళ్లు