Smart Cities: ఏప్రిల్ నాటికి దేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు రెడీ

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు.

భారతదేశంలో మరో 22 స్మార్ట్ సిటీలు (Smart Cities) ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్నాయి.కేంద్ర ప్రభుత్వ జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ నగరాలను డెవలప్ చేశారు. ఆయా నగరాల అభివృద్ధికి అవసరమైన అన్ని ప్రాజెక్ట్‌లను ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయి. జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్ కింద నామినేట్ చేయబడిన మిగిలిన 78 నగరాలు కూడా రాబోయే నాలుగు నెలల్లో రెడీ అవుతాయి. రాబోయే కొన్ని నెలల్లో వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీస్ అభివృద్ధి ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వం వేగాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఏమిటీ మిషన్?

నేషనల్ స్మార్ట్ సిటీస్ (Smart Cities) మిషన్ 2015 జూన్ లో ప్రారంభించబడింది. దీని కింద 2016 మరియు 2018 మధ్య నాలుగు స్థాయిల పోటీ ద్వారా 100 నగరాలు ఎంపిక చేయబడ్డాయి.ఈ మిషన్ కింద ఒక్కో స్మార్ట్ సిటీకి ఏటా రూ.100 కోట్లు ఇస్తానని కేంద్రం ప్రకటించింది. ఐదేళ్లలో రూ. 48,000 కోట్లు ఈ మిషన్ పై ఖర్చు చేస్తామని వెల్లడించింది.

ఏప్రిల్ నాటికి సిద్ధం కానున్న స్మార్ట్ సిటీల (Smart Cities) వివరాలు

ఆగ్రా , అహ్మదాబాద్ , అమరావతి, భోపాల్ , భువనేశ్వర్, చెన్నై , కోయంబత్తూర్, ఈరోడ్, ఇండోర్, కాకినాడ, మదురై, పింప్రి-చించ్వాడ్, పూణే , రాంచీ, సేలం, సూరత్ నగరాలు ఏప్రిల్ నాటికి స్మార్ట్ సిటీస్ గా మారనున్నాయి.తంజావూరు, తిరుచిరాపల్లి, ఉదయపూర్,  వారణాసి , వెల్లూరు,  విశాఖపట్నం నగరాల్లో ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయి. అవి పూర్తి కాగానే ఏప్రిల్ నాటికి 22 స్మార్ట్ సిటీలను పూర్తి చేయనున్నారు. ఈ మిషన్ కింద ఎంపిక చేసిన మిగిలిన 78 నగరాలలో కూడా పెండింగ్‌ పనులు వచ్చే మూడు, నాలుగు నెలల్లో పూర్తి కానున్నాయి.

రూ. 98,796 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి

దేశంలో స్మార్ట్ సిటీస్ మిషన్ కింద జనవరి 27 నాటికి రూ.98,796 కోట్లు విలువైన 5246 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రూ.1,81,322 కోట్ల విలువైన పనులను మరో 100 నగరాల్లో చేసేందుకు ఆర్డర్లు జారీ చేశారు.  ఈ మిషన్ కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 36,447 కోట్లులో 88% (రూ. 32,095 కోట్లు) వినియోగించారు.

ఆగ్రా, వారణాసి ముందంజలో

2019 సంవత్సరం నుంచి ఉత్తర ప్రదేశ్‌లో 10 స్మార్ట్ సిటీల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5,000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఈ మిషన్ లో
వారణాసి,ఆగ్రాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఇప్పటికే 85% లక్ష్యాలను పూర్తి చేశాయి. మిగిలిన నగరాలు కూడా తమ కొనసాగుతున్న ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నాయి.

Also Read:  Final Test: అహ్మదాబాద్ టెస్ట్ డ్రా.. సిరీస్ భారత్ కైవసం