Business Ideas: ఈ వ్యాపారంలో సంపాదన లక్షల్లో ఉంటుంది.. చేయాల్సిన బిజినెస్ ఇదే..!

భారతదేశంలో మారుతున్న కాలంతో చాలా మంది యువకులు ఉద్యోగాలు చేయడానికి బదులుగా తమ స్వంత వ్యాపారం (Business) చేయడానికి ఇష్టపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 02:27 PM IST

Business Ideas: భారతదేశంలో మారుతున్న కాలంతో చాలా మంది యువకులు ఉద్యోగాలు చేయడానికి బదులుగా తమ స్వంత వ్యాపారం (Business) చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని (Business) ప్రారంభించాలనుకుంటే ఈ వ్యాపార ప్రణాళిక మీకోసమే. భారతదేశంలో కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం ప్లాస్టిక్ స్ట్రాస్ వాడకాన్ని నిషేధించింది. ఇటువంటి పరిస్థితిలో మార్కెట్ లో పేపర్ స్ట్రా కోసం డిమాండ్ చాలా పెరిగింది. మీరు పేపర్ స్ట్రా వ్యాపారం చేయడం ద్వారా ప్రతి నెల అధికంగా సంపాదించవచ్చు. పేపర్ స్ట్రా ఎలా తయారు చేయాలో మేము మీకు సమాచారాన్ని ఇక్కడ అందిస్తున్నాం.

భారత ప్రభుత్వం 1 జూలై 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించింది. దీంతో మార్కెట్‌లో ప్లాస్టిక్‌ వస్తువులు మాయమవుతున్నాయి. వాటిలో ఒకటి ప్లాస్టిక్ స్ట్రా ఒకటి. వీటి డిమాండ్ పానీయాలకు చాలా ఎక్కువ. ప్రభుత్వ ఈ నిర్ణయంతో ప్లాస్టిక్ డ్రింకింగ్ స్ట్రాస్ స్థానంలో పేపర్ స్ట్రాలకు డిమాండ్ పెరిగింది.

ఈ రోజుల్లో చాలా కంపెనీలు, రెస్టారెంట్ల యజమానులు పేపర్ స్ట్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ముందుగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుని సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) నివేదిక ప్రకారం.. పేపర్ స్ట్రాస్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి మీకు సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుంది. అందులో భాగంగా రూ.14 లక్షలు బ్యాంకు నుండి రుణంగా ఇవ్వబడుతుంది. మీరు ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెల 50 నుండి 60 వేల రూపాయలు సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు స్థానిక మార్కెట్, హోటల్ రెస్టారెంట్ మొదలైన వాటితో మాట్లాడుకోవాలి.ఈ విధంగా పేపర్ స్ట్రాస్ ని విక్రయించవచ్చు.

Also Read: Free Thali Rs 90000 : థాలీ ఫ్రీ.. ఆర్డర్ చేశాక రూ.90,000 కట్

పేపర్ స్ట్రా తయారీ వ్యాపారంలో సంపాదన లక్షల్లో ఉంటుంది. KVIC నివేదిక ప్రకారం.. మీరు 75% సామర్థ్యంతో పేపర్ స్ట్రా తయారీని ప్రారంభిస్తే మీ స్థూల విక్రయాలు రూ. 85.67 లక్షలు. ఇందులో అన్ని ఖర్చులు, పన్నులు తీసుకున్న తర్వాత ఏటా రూ.9.64 లక్షలు సంపాదిస్తుంది. అంటే ప్రతి నెలా రూ.80వేలకు పైగా ఆదాయం ఉంటుంది.