Site icon HashtagU Telugu

Bus Conductor Vs Retired IAS : రిటైర్డ్ ఐఏఎస్‌పై బస్సు కండక్టర్ దాడి.. రూ.10 టికెట్ వల్లే!

Bus Conductor Vs Retired Ias Rajasthans Jaipur

Bus Conductor Vs Retired IAS : రాజస్థాన్‌లోని జైపూర్‌ నగరంలో దారుణం జరిగింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడికి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో వైరల్ కావడంతో జనవరి 10న చోటుచేసుకున్న ఈ ఘటన వార్తల్లోకి ఎక్కింది. ఇంతకీ ఎందుకీ దాడి జరిగింది ?  రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై కండక్టర్ ఎందుకు ఎటాక్ చేశాడు ?

Also Read :PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?

దాడి బారినపడిన ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు ఆర్‌.ఎల్.మీనా. ఆయన వయసు 75 ఏళ్లు. జైపూర్ నగరంలో ఉన్న ఒక బస్టాండు వద్ద సదరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బస్సు ఎక్కారు.  నగరంలోని ఆగ్రా రోడ్‌లో ఉన్న కనోటా బస్టాండ్ వరకు టికెట్ తీసుకున్నారు. అయితే కనోటా బస్టాండ్ స్టాప్ వచ్చినా.. దానిపై బస్సు కండక్టర్ ఘనశ్యాం శర్మ సమాచారాన్ని ఇవ్వలేదు. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు ఆర్‌.ఎల్.మీనా బస్సులోనే కూర్చుండిపోయారు. బస్సు ఆ స్టాప్‌ను దాటేసి, మరో స్టాప్ దాకా వెళ్లింది. ఆ సమయంలో  ఆర్‌.ఎల్.మీనా దగ్గరికి వచ్చిన బస్సు కండక్టర్.. టికెట్ తీసుకున్న దాని కంటే ఎక్కువ దూరానికి (నైలా బస్టాప్ వరకు) బస్సు చేరుకున్నందున అదనంగా రూ.10 టికెట్ తీసుకోవాలన్నారు.

Also Read :GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్‌‌లో ప్రభుత్వ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌.. ఎందుకో తెలుసా ?

అయితే బస్సు కండక్టర్ తప్పిదం వల్లే తాను ఇంత దూరం(నైలా బస్టాప్ వరకు) వచ్చానని  రిటైర్డ్ ఐఏఎస్ ఆర్‌.ఎల్.మీనా వాదించారు. అదనంగా  10 రూపాయలిచ్చి మరో టికెట్ తీసుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో బస్సు కండక్టర్ ఘనశ్యాం శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్‌.ఎల్.మీనా మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. ఈక్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్‌పై కండక్టర్ దాడి చేశాడు. ఆ బస్సులో కూర్చున్న కొందరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో(Bus Conductor Vs Retired IAS) పోస్ట్ చేశారు. బస్సు కండక్టర్ దాడి చేసిన తర్వాత.. ఆర్.ఎల్.మీనా బస్సు దిగి వెళ్లిపోయారు. దీనిపై ఆయన రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు బస్సు కండక్టర్‌పై జైపూర్ నగర రవాణా విభాగం సస్పెన్షన్ వేటు వేసింది. కనీసం సీనియర్ సిటిజెన్ అని కూడా చూడకుండా ఆర్.ఎల్.మీనాపై కండక్టర్ దాడి చేయడం అందరినీ కలచి వేసింది.