Fire Accident: 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు

21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - January 17, 2023 / 10:35 AM IST

21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులందరినీ కిందకు దించారు. గుర్షాగంజ్ లోని జసోదా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బస్సు దగ్ధమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్ డ్రైవర్ అప్రమత్తత వల్ల ఘోర ప్రమాదం తప్పింది.

Also Read: 50 Women Kidnapped: బుర్కినా ఫాసోలో 50 మంది మహిళల కిడ్నాప్

అంతకముందు.. యూపీలోని కన్నౌజ్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిబ్రామావు ​​కొత్వాలి మార్కెట్‌ సమీపంలో అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో ఘటనా స్థలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఫిరోజాబాద్ జిల్లా పైధాత్ గ్రామంలో ఉన్న జఖాయ్ దేవతను దర్శించుకుని తిరిగి వస్తున్న భక్తులతో నిండిన బస్సు చిబ్రామౌ కొత్వాలి ప్రాంతంలోని నిగమ్ మండి సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది భక్తులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 100 పడకల ఆస్పత్రికి తరలించారు. బస్సులోని సిబ్బంది మద్యం సేవించినట్లు భక్తులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడిపాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.