Maharashtra : గర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేసిన ప్రభుత్వ అధికారి కొడుకు

దేశంలో ఆడవారిపై అఘాత్యాలు ఆగడం లేదు..ప్రతి రోజు అనేక చోట్ల ఆడవారి ఫై దాడులు అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుమారులు సైతం ఈ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు..తన గర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది. We’re now on WhatsApp. Click to Join. మహారాష్ట్ర (Maharashtra) స్టేట్ రోడ్ […]

Published By: HashtagU Telugu Desk
Bureaucrat's Son Accused Of

Bureaucrat's Son Accused Of

దేశంలో ఆడవారిపై అఘాత్యాలు ఆగడం లేదు..ప్రతి రోజు అనేక చోట్ల ఆడవారి ఫై దాడులు అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సామాన్య ప్రజలే కాదు ప్రభుత్వ ఉద్యోగులు , వారి కుమారులు సైతం ఈ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ అధికారి కొడుకు..తన గర్ల్‌ఫ్రెండ్‌ను చిత్ర హింసలకు గురి చేసిన సంఘటన ఇప్పుడు వార్తల్లో హైలైట్ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మహారాష్ట్ర (Maharashtra) స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ మేనిజింగ్ డైరెక్టర్ అనిల్ గైక్వాడ్ కుమారుడు అశ్వజిత్ గైక్వాడ్ (Ashwajit Gaikwad) ..తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా సింగ్ (Priya Singh) (26)ను సోమావారం థానేలో ఉన్న ఓ హోటల్ వద్ద దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ..ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేసింది. స్నేహితుడితో కలిసి భాయ్‌ఫ్రెండ్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తనను తిట్టవద్దు అని చెప్పినా వినిపించుకోలేదని, తనపై చేయి చేసుకున్నాడని, తన గొంతును నొక్కే ప్రయత్నం చేశాడని తెలిపింది. ఈ ఘటనలో తనను రోడ్డుపై పడేసి కారుతో తొక్కించారని ఆమె పేర్కొంది. నొప్పులతోనే అరగంటకుపైగా రోడ్డుపై పడి ఉన్నానని, ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి తనకు హెల్ప్ చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Read Also : Telangana Assembly Session 2023: కేటీఆర్‌‌ను ఎన్‌ఆర్‌ఐ అంటూ రేవంత్ సెటైర్స్

  Last Updated: 16 Dec 2023, 02:54 PM IST