Deputy PM : మన దేశంలో చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఉప ప్రధానమంత్రి పదవి గురించి చర్చ మొదలైంది. జంపింగ్ జపాంగ్‌లకు పేరుగాంచిన జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఉప ప్రధానమంత్రి పదవి దక్కొచ్చనే టాక్ మొదలైంది. ఈ టాక్‌ను మొదలు పెట్టింది జేడీయూ నేతలు కాదు.. బీజేపీ నేతలే. సాక్షాత్తూ బీజేపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబేనే ఈ దిశగా సంచలన కామెంట్స్ చేశారు. నితీశ్ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలని తాను అనుకుంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్‌లోనే మాట్లాడుతుంటారు. బహుశా ఈ వ్యాఖ్యలు కూడా ఆ కోణంలోనే వచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.
Also Read :Purandeswari: పురందేశ్వరికి కీలక పదవి.. బీజేపీ పెద్ద స్కెచ్
ఇది నా కోరిక.. నా వ్యక్తిగత అభిప్రాయం : అశ్వినీ కుమార్ చౌబే
‘‘ఎన్‌డీఏ కూటమికి నితీశ్ కుమార్ చేసిన సేవలు వెలకట్టలేనివి. ఆయన ఇప్పుడు కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా నితీశ్‌కు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలనేది నా కోరిక. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ అదే జరిగితే, బిహార్ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్ నిలుస్తారు’’ అని మాజీ కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే (బీజేపీ) కామెంట్స్ చేశారు. గతంలో బిహార్ నుంచి ఉప ప్రధానంగా బాబూ జగ్జీవన్ రామ్‌కు అవకాశం లభించింది.
Also Read :KCR : ఏఐజీ ఆస్పత్రికి గులాబీ బాస్.. ఏమైంది ?
ఈ ఏడాది బిహార్ ఎన్నికలు.. స్కెచ్ అదేనా ?
ఈ ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర తరహా ప్లాన్‌ను బిహార్ రాష్ట్రంలోనూ అమలు చేయాలని బీజేపీ(Deputy PM) పెద్దలు భావిస్తున్నారట. తమ కంటే తక్కువ అసెంబ్లీ సీట్లను కలిగిన ఏక్‌నాథ్ షిండే శివసేనను సీఎం సీటు నుంచి బీజేపీ పెద్దలు తప్పించారు. బిహార్‌లోనూ బీజేపీ కంటే తక్కువ సీట్లున్న జేడీయూ పార్టీ (నితీశ్ కుమార్) సీఎం సీటులో ఉండటాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఎన్‌డీయే కూటమిలో జేడీయూ కీలకంగా ఉన్నందున నితీశ్‌కు వెంటనే చెక్ పెట్టలేని పరిస్థితి ఉంది. అందుకే ఆయనకు ఉప ప్రధాని పదవిని అప్పగించి, బిహార్ సీఎం సీటును బీజేపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మాజీ కేంద్ర మంత్రితో తాజా వ్యాఖ్యలు చేయించి ఉంటారని భావిస్తున్నారు.