Mayawati Successor : రాజకీయ వారసుడి పేరును ప్రకటించిన మాయావతి

Mayawati Successor : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి కీలక ప్రకటన విడుదల చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mayawati Successor

Mayawati Successor

Mayawati Successor : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి కీలక ప్రకటన విడుదల చేశారు. తన వారసుడిగా మేనల్లుడు 31 ఏళ్ల ఆకాష్ ఆనంద్‌ పేరును ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన బీఎస్పీ సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో తదుపరిగా బీఎస్పీ చీఫ్ పగ్గాలను ఆకాష్ ఆనంద్ చేపడతారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. గత సంవత్సరం నుంచే బీఎస్పీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఆకాష్ వ్యవహరిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2016లో బీఎస్పీలో చేరిన ఆకాష్ ఆనంద్.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్‌‌గా అవకాశాన్ని పొందారు. 2022లో రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఆయన పాదయాత్ర చేయడం ద్వారా జాతీయ మీడియా వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరో ఐదు నెలల టైం ఉన్న తరుణంలో తన వారసుడిపై(Mayawati Successor)  మాయావతి చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 2018 సంవత్సరంలో ఆకాష్ ఆనంద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో 13 కిలోమీటర్ల మేర ‘‘స్వాభిమాన్ సంకల్ప్ యాత్ర’’ చేశారు. ఆ ఏడాది రాజస్థాన్‌ అసెంబ్లీ పోల్స్‌లో బీఎస్పీకి 6 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. 

Also Read: Viral Video : సీఎం మాన్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు.. వీడియో వైరల్

  Last Updated: 10 Dec 2023, 01:03 PM IST