Bomb Threat : జర్మనీ నుండి హైదరాబాద్‌కి వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ LH752 విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న ఈ విమానానికి బెదిరింపు సమాచారం రావడంతో ఫైలట్ విమానాన్ని తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.
ఈ ఫ్లైట్‌లో అధిక సంఖ్యలో హైదరాబాద్‌కి చెందిన ప్రయాణికులు ఉన్నారు. కొంతమంది ముంబైకి వెళ్లే వారు కూడా ఈ same విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైట్ బయలుదేరిన దాదాపు రెండు గంటల తర్వాత బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. వెంటనే సురక్షిత చర్యల కోసం జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టు వైపు విమానం తిరిగిపోయింది.
అక్కడ విమానాన్ని భద్రతాధికారులు తనిఖీ చేసి, బాంబు బెదిరింపు ఫేక్ కాల్ అని నిర్ధారించారు. అయినా, ముందుజాగ్రత్తగా మరో 2–3 గంటల పాటు పూర్తి తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను విమానాశ్రయంలోనే ఉంచి తాత్కాలిక వసతులు కల్పించినట్లు తెలుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం విమానము ఆదివారం అర్ధరాత్రి తర్వాత హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో విమానం వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం ప్రయాణికులు జర్మనీలో ఉన్న విమానాశ్రయంలో ఉన్నారు. సోమవారం ఉదయం మళ్లీ విమానం హైదరాబాద్‌కు బయలుదేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Salman Khan : కపిల్ షోలో సల్మాన్ కామెంట్స్ వైరల్.. సంబంధాలపై తనదైన స్టైల్‌లో సల్లు భాయ్