Bomb Threat Calls : అలాంటి కాల్స్‌ చేస్తే.. ఐదేళ్లు బ్యాన్

ఇటీవల కాలంలో మనదేశంలోని విద్యాసంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Bomb Threat Calls

Bomb Threat Calls : ఇటీవల కాలంలో మనదేశంలోని విద్యాసంస్థలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువయ్యాయి. అవన్నీ ఫేక్ కాల్సే అని దర్యాప్తులో తేలుతోంది. చివరకు అందరూ ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటున్నారు. అయితే ఆ కాల్స్, మెయిల్స్ అందగానే పోలీసులు, ప్రజలు పడుతున్న టెన్షన్ అంతాఇంతా  కాదు. దీనివల్ల ఆయా విద్యాసంస్థలు, విమానాశ్రయాల విలువైన సమయం వేస్ట్ అవుతోంది. ఈనేపథ్యంలో ఫేక్ వార్నింగ్ కాల్స్ చేసే వారిపై కొరడా ఝుళిపించేందుకు ‘ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) నడుం బిగించింది.

We’re now on WhatsApp. Click to Join

ఫేక్ కాల్స్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకునే దిశగా బీసీఏఎస్ అడుగులు వేస్తోంది. నకిలీ కాల్స్‌ కేసుల్లో ఎవరైనా దొరికిపోయి దోషులుగా తేలితే ఐదేళ్ల పాటు విమానాల్లో ప్రయాణించకుండా బ్యాన్ విధిస్తారు. ఈమేరకు వివరాలతో కూడిన ప్రపోజల్స్‌ను పౌర విమానయాన శాఖకు పంపుతామని బీసీఏఎస్ అంటోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇలాంటి ఫేక్ కాల్స్ వ్యవహారంలో దోషులుగా తేలే వారికి మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విమాన ప్రయాణంలో బ్యాన్ విధిస్తారు. నిందితులు ఏ ఎయిర్‌లైన్‌ కంపెనీకి అయితే బెదిరింపులు చేశారో, దానివరకు మాత్రమే ఆ నిబంధన అప్లై అవుతోంది. అయితే ఈ శిక్షను అన్ని సంస్థల విమానాలకు వర్తింపజేయాలని బీసీఏఎస్‌ కోరుతోంది.

Also Read : NEET Toppers : ఆరుగురు ‘నీట్’ టాపర్లకు బ్యాడ్ న్యూస్.. కొత్త అప్‌డేట్ ఇదీ

  • తాజాగా మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మధ్యాహ్నం టైంలో ఒకే మెయిల్‌ ఐడీ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని నగరాల్లో ఉన్న విమానాశ్రయాలకు వార్నింగ్ మెయిల్స్ వచ్చాయి.
  • దీంతో కొన్ని గంటలపాటు విమానాశ్రయాల్లో సేవలు నిలిచాయి.
  • ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్‌ గ్రూపు ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉందని గుర్తించారు.

Also Read : Nehru Zoological Park : హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్కు ను తరలిస్తున్నారా..?

ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్స్

ఖతర్ రాజధాని దోహాలోని హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా నిలిచింది. సింగపూర్‌కు చెందిన ఛాంగి రెండో స్థానంలో ఉంది. స్కైట్రాక్స్‌ సంస్థ ఈమేరకు వివరాలతో నివేదికను విడుదల చేసింది. సియోల్‌ ఇన్చెయాన్‌ విమానాశ్రయం ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. టోక్యోలోని హనీదా, నరీతా వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. హాంకాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 22 స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం.అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా తొలి 20 స్థానాల్లో లేదు. సియాటెల్‌లోని టకోమా ఎయిర్‌పోర్టుకు దక్కిన 24వ ర్యాంకే ఆ దేశానికి అత్యుత్తమైనది.

  Last Updated: 19 Jun 2024, 05:13 PM IST