IIT Kharagpur: ఐఐటీలో మరో విద్యార్థి మరణించాడు. పశ్చిమ బెంగాల్ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో ఈ విషాదం చోటు చేసుకుంది. నాల్గవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మృతదేహాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి. తెలంగాణ వాసి కె కిరణ్ చంద్ర (21)గా గుర్తించారు. ఈ బాధాకర విషయాన్ని కిరణ్ చంద్ర తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు అయితే కిరణ్ మృతి క్యాంపస్ లో కలకలం సృష్టించింది.
కిరణ్ చంద్ర హాస్టల్లో ఉరివేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న క్యాంపస్ యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే కిరణ్ చంద్ర అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా భావించినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
గత సంవత్సరం నుండి, IIT-ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో విద్యార్థుల అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2022లో ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో విద్యార్థి ఫైజాన్ అహ్మద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. ఈ ఏడాది జూన్‌లో మరో విద్యార్థి సూర్యా దిపెన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు.
Also Read: BJP : తెలంగాణలో బిజెపి మాస్టర్ స్కెచ్.. పవన్ కళ్యాణ్ సమేతంగా..