Site icon HashtagU Telugu

Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు

Rahul Gandhi Sikh Controversy

Rahul Gandhi Sikh Controversy

Rahul Gandhi Sikh Controversy: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటన సందర్భంగా సిక్కు సమాజానికి సంబంధించి చేసిన ప్రకటనలపై బిజెపి సిక్కు సెల్ సభ్యులు బుధవారం న్యూఢిల్లీలోని జన్‌పథ్ సమీపంలోని ఆయన నివాసం వెలుపల నిరసనకు దిగారు. బీజేపీ ఢిల్లీలోని సిక్కు ప్రకోష్ఠ్ సభ్యులు, మహిళలతో సహా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వారు విజ్ఞాన్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి గాంధీ నివాసం జనపథ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు, కాని పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్‌పి సింగ్ అన్నారు. సిక్కులను అవమానించారని, ఈ నేపథ్యంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు దేశంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కాంగ్రెస్‌దే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సిక్కు కమ్యూనిటీ గురించి యుఎస్‌లో గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా విమర్శించింది. విదేశాలలో ఉండి సున్నితమైన సమస్యల గురించి మాట్లాడుతూ ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సోమవారం వాషింగ్టన్ డిసిలో వందల మంది భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్, ఆర్‌ఎస్‌ఎస్ కొన్ని మతాలు, భాషలు మరియు వర్గాలను ఇతరుల కంటే తక్కువ స్థాయిలో పరిగణిస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో ముందు వరుసలో హాజరైన సిక్కుల్లో ఒకరిని “తలపాగా ఉన్న తమ్ముడా నీ పేరేంటి” అని అడిగారు. ఈ కార్యక్రమంలో సిక్కు(Sikh)లపై రాహుల్ చేసిన పలు వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి.

Also Read: AP Govt : ఏపీ ఎక్సైజ్‌ శాఖలో ‘సెబ్‌’ రద్దు..డీజీపీ ఉత్తర్వులు