BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్‌లో విలీనం ఖాయంః హిమంత్‌ బిశ్వశర్మ

Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) భారత్‌లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. ”డబుల్‌, ట్రిపుల్‌ […]

Published By: HashtagU Telugu Desk
BJP wins 400 seats.. POK will merge with India, says Himanta Biswa Sarma

BJP wins 400 seats.. POK will merge with India, says Himanta Biswa Sarma

Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) భారత్‌లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

”డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు ఎందుకు చేశారని సచిన్‌ తెందూల్కర్‌ను అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేవిధంగా గత లోక్‌సభ ఎన్నికల్లో 300 సీట్లతో గెలుపొందిన బీజేపీ.. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఎన్నికల్లో ఒకవేళ 400 సీట్లు సొంతం చేసుకుంటే శ్రీ కృష్ణుడి జన్మస్థలం మథురలో దేవాలయాన్ని, వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తుంది. దీంతో పాటు పీవోకేను భారత్‌లో విలీనం చేసేందుకు కృషి చేస్తుంది” అని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో పీవోకే అంశంపై పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీపై హిమంత విమర్శలు గుప్పించారు.

Read Also: Election Commission : ఏపీలో ఉద్రిక్తతలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు

మరోవైపు పీవోకేలో ప్రస్తుతమున్న పరిస్థితిపై కేంద్రమంత్రి అమిత్‌ షా స్పందించారు. ‘ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో శాంతి నెలకొంది. కానీ, ప్రస్తుతం అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆజాదీ నినాదాలు వినిపిస్తున్నాయి. త్వరలో పీవోకే భారత్‌లో విలీనం అవుతుందనడంలో సందేహం లేదు. దాన్ని తిరిగి మన దేశంలో కలిపేందుకు కృషి చేస్తాం” అని షా పేర్కొన్నారు.

 

  Last Updated: 15 May 2024, 04:41 PM IST