Site icon HashtagU Telugu

LK Advani : ఎల్​కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

Modi Advani

LK Advani : బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్​కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌‌ ఆస్పత్రిలోని పాత ప్రైవేట్ వార్డులో చేర్పించారు. అద్వానీ(LK Advani) ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.  ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపాయి. 96ఏళ్ల అద్వానీకి ఢిల్లీ ఎయిమ్స్‌లోని యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో  వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను కాసేపట్లో విడుదల చేయనున్నారు. అద్వానీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అద్వానీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యంపై ఆరాతీశారు. అద్వానీకి మెరుగైన వైద్యం అందించాలని ఎయిమ్స్ వైద్యులకు నిర్దేశించారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read :SA vs AFG Semifinal: సౌతాఫ్రికాను దాటి ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్ కు చేరగలదా..?