Site icon HashtagU Telugu

Ministries Race : ఆ ఆరు మంత్రి పదవులు అడగొద్దు.. ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ నో !

Ministries Race

Ministries Race

Ministries Race : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 లోక్‌సభ సీట్లు. ప్రస్తుతం ఈ ఫిగర్ ఎన్డీయే కూటమి వద్ద ఉంది. 16 లోక్‌సభ సీట్లున్న టీడీపీ.. 12 లోక్‌సభ సీట్లున్న జేడీయూలు ఇప్పుడు ఎన్డీయేలో కింగ్ మేకర్స్‌గా మారాయి. టీడీపీ దాదాపు 8 కేంద్రమంత్రి పదవులను కోరుతోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జేడీయూ కూడా దాదాపు 5 కేంద్రమంత్రి పదవులను అడుగుతోంది. ఒకవేళ ఈ రెండు పార్టీలకే 13 కేంద్రమంత్రి పదవులు ఇస్తే.. బీజేపీలోని దిగ్గజ నేతలకు కీలక అవకాశాలు చేజారే ఛాన్స్ ఉంటుంది. దీంతో కొన్ని మంత్రి పదవులను కూటమిలోని ఇతర పార్టీలకు ఇవ్వొద్దని బీజేపీ డిసైడ్ అయిందట.

We’re now on WhatsApp. Click to Join

ప్రత్యేకించి రైల్వే శాఖ, హోం శాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, న్యాయ శాఖ, ఐటీ శాఖలను మిత్రపక్షాలకు ఇవ్వొద్దని కాషాయ పార్టీ భావిస్తోందట. ఎందుకంటే ఈ శాఖలను ఇప్పటివరకు బీజేపీ దిగ్గజ నేతలైన అమిత్ షా, రాజ్‌నాథ్ లాంటి వాళ్లు నిర్వర్తిస్తున్నారు. వారిని తొలగించి.. ఇతర మిత్రపక్షాలకు ఛాన్స్ ఇచ్చేందుకు బీజేపీలోని చాలామంది కీలక నేతలు ససేమిరా అంటున్నారనే టాక్ వినిపిస్తోంది. 2014, 2019 ఎన్నికల తర్వాత బీజేపీకి ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. మంత్రి పదవుల విషయంలో అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి బీజేపీకి ఆనాడు ఎదురుకాలేదు. సొంతంగా  మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఇప్పుడు కాషాయ పార్టీ పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటోంది.

Also Read : Bird Flu : బర్డ్ ఫ్లూ‌తో తొలిసారిగా మనిషి మృతి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ జూన్ 9న(ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎన్డీయే కూటమికి సంబంధించిన మరో కీలక సమావేశం శుక్రవారం (జూన్‌ 7న) జరగబోతోంది. ఈ మీటింగులోనే కూటమికి చెందిన మిత్రపక్షాలకు మంత్రి పదవుల కేటాయింపుపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ సమావేశం సందర్భంగానే తమ డిమాండ్లను బీజేపీ పెద్దల ఎదుట ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ మంత్రి పదవులను అడిగితే కొన్నైనా కేటాయిస్తారనే ఆలోచనతో ఎన్డీయే మిత్రపక్షాలు ఉన్నాయి. కీలకమైన వ్యవసాయ, ఆరోగ్య, ఐటీశాఖలను టీడీపీ డిమాండ్ చేస్తోంది. రైల్వే శాఖ, రోడ్డు రవాణా శాఖ (Ministries Race) తమకే ఇవ్వాలని జేడీయూ కోరుతోంది. ఇక ఇతర మిత్రపక్ష పార్టీలు  కూడా ఈవిషయంలో పెద్ద డిమాండ్లనే ప్రపోజ్ చేయబోతున్నాయట. వీటిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

Also Read : Nuclear Weapons : మా దేశం జోలికొస్తే అణుబాంబులు వేస్తాం : పుతిన్