Site icon HashtagU Telugu

Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..

Maharashtra

Maharashtra

Maharashtra : మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి.  శివసేన పార్టీ శివసేన (ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్‌నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో  శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra)  బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎంగా శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే ఉన్నారు. ఇక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్ నుంచి అజిత్ పవార్ చేతికొచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు కీలక పదవులు ఇచ్చిన బీజేపీ ఎట్టకేలకు వాటితో సీట్ల సర్దుబాటు ఫార్ములాపై ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ సీట్లకుగానూ బీజేపీ 32 స్థానాల్లో పోటీ చేయనుంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 12, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 3 నుంచి నాలుగు లోక్‌సభ సీట్లను కేటాయించినట్టు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join

మంగళవారం అర్ధరాత్రి మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చించగా, ఇరు పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం. 2019 ఎన్నికల్లో శివసేన 23 సీట్లు గెల్చుకుంది. అయితే ఇప్పుడు కూడా 23 సెగ్మెంట్లు తమకే కేటాయించాలని షిండే వర్గం పట్టుబట్టింది. అయితే 12 మాత్రమే ఇస్తామని అమిత్‌షా తేల్చి చెప్పారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ 10సీట్లు డిమాండ్ చేశారు. అయితే 2019 ఎన్నికల్లో శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ నాలుగు సీట్లే గెలిచింది. దీంతో ఈసారి కూడా నాలుగే సీట్లు ఇస్తామని అమిత్‌షా చెప్పారు.శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన తర్వాత ప్రస్తుతం ఒక ఎంపీ మాత్రమే అజిత్‌ పవార్ వెంట ఉన్నారు. మార్చి 2వ తేదీన లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో మహారాష్ట్ర టికెట్ల వివరాలు లేవు. ఇప్పుడు సీట్ల పంపకాలపై క్లారిటీ రావడంతో త్వరలోనే  మహారాష్ట్ర అభ్యర్థులను కూడా బీజేపీ ఖరారు చేయనుంది.

Also Read :Shortest Doctor : 3 అడుగుల డాక్టర్​.. న్యాయపోరాటంతో ‘వరల్డ్ రికార్డ్’ విజయం

Exit mobile version