2024 Elections Donations : 2024 ఎన్నికల వేళ బీజేపీ విరాళాలు 87 శాతం జంప్.. కాంగ్రెస్‌కు సైతం..

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీల కంటే బీజేపీకే అత్యధిక విరాళాలు(2024 Elections Donations) వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
2024 Elections Donations Electoral Bonds Bjp Donations Congress Donations

2024 Elections Donations : 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు  ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? అనే వివరాలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వార్షిక ఆడిట్ నివేదిక (2023-24)ను విడుదల చేసింది. దానిలోని వివరాలను మనం ఈ వార్తలో చూద్దాం..

Also Read :Chandrababu Cases : చంద్రబాబు‌కు ‘సుప్రీం’లో భారీ ఊరట.. ఒక్క మాట వినకుండానే ఆ పిటిషన్ కొట్టివేత

ఈసీ నివేదికలోని కీలక వివరాలివీ..

  • 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, 2023-2024 ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీల కంటే బీజేపీకే అత్యధిక విరాళాలు(2024 Elections Donations) వచ్చాయి. ఆ పార్టీకి అత్యధికంగా రూ.3,967.14 కోట్ల విరాళాలు వచ్చాయి.
  • అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2022-23) కంటే 2023-2024లో  87 శాతం ఎక్కువ విరాళాలను కమలదళం పొందింది.
  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.2,360 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో రూ.1,294.14 కోట్లు   ఎన్నికల బాండ్ల ద్వారానే సమకూరాయి.  ఈసీ ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆ సంవత్సరంలో  బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా రూ.1,685.62 కోట్ల విరాళాలు వచ్చాయి.
  •  2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ రూ.1,092.15 కోట్లను ఖర్చు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ ఎన్నికల ప్రచార ఖర్చు రూ.1,754.06 కోట్లుగా నమోదైంది.  లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగిన సంవత్సరంలో బీజేపీ పత్రికా ప్రకటనలు, ప్రచారం కోసం రూ.591.39 కోట్లను ఖర్చు చేసింది.

Also Read :Oben Rorr EZ: కేవ‌లం రూ. 90వేల‌కు ఎల‌క్ట్రిక్ బైక్‌.. 45 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్‌!

  •  2023-24లో కాంగ్రెస్ పార్టీ విరాళాలు 320 శాతం పెరిగి రూ.1,129.66 కోట్లకు చేరాయి.
  • 2022-23లో  కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ.268.62 కోట్ల విరాళాలే వచ్చాయి.
  • కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల బాండ్ల ద్వారా 2022-23లో  రూ.171 కోట్లు రాగా, 2023-24లో రూ.828.36 కోట్లు వచ్చాయి.
  •  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చు 2022-23లో  రూ.192.55 కోట్లు ఉండగా, 2023-24లో ఎన్నికల ప్రచారం కోసం రూ.619.67 కోట్లను వెచ్చించింది.
  • మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 2022-23లో  రూ.333.46 కోట్ల ఎన్నికల విరాళాలు రాగా,  2023-24లో రూ.646.39 కోట్ల విరాళాలు వచ్చాయి.
  Last Updated: 28 Jan 2025, 02:53 PM IST