Site icon HashtagU Telugu

BJP Rajya Sabha Candidate List : 14 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బిజెపి

BJP First List

Bjp Releases List Of Candid

ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections) జరగబోతున్న సంగతి తెలిసిందే.అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్‌ జరగనుండగా.. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమబెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్‌ 5, గుజరాత్‌ 4, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మూడేసి చొప్పున స్థానాలకు, హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. ఇప్పటీకే దీనికి సంబదించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం తో అన్ని పార్టీలు రాజ్య సభ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో బిజెపి 14 మంది అభ్యర్థులను (BJP Rajya Sabha Candidate List) ఖరారు చేసింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఏకంగా ఏడుగురిని ఖరారు చేయడం విశేషం. ఇక బిహార్‌ నుంచి ఇద్దరిని, కర్ణాటక, హర్యానా, వెస్ట్‌ బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఉత్తరాఖండ్‌ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభకు అభ్యర్థులుగా ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి డా.సుధాన్షు త్రివేది, నవీన్‌జైన్‌, ఆర్‌పీఎన్‌ సింగ్‌, సాధనాసింగ్‌, డా సంగీత బల్వంత్‌, తేజ్‌వీర్‌ సింగ్‌, అమర్‌పాల్ మౌర్యాలను అభ్యర్థులగా ఖరారు చేస్తూ జాబితాను ప్రకటించింది.

మిగతా రాష్ట్రాల అభ్యర్థులు చూస్తే..

బిహార్‌ – డా. ధర్మశీల గుప్తా, భీమ్‌ సింగ్‌
ఛత్తీస్‌గఢ్‌- రాజా దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌
హరియాణా – సుభాష్‌ బరాలా
కర్ణాటక – నారాయణ కష్ణస భండగే
ఉత్తరాఖండ్‌ – మహేంద్ర భట్‌
పశ్చిమబెంగాల్‌ – సమిక్‌ భట్టాచార్య.

Read Also : Free Current Guidelines : మీకు ఫ్రీ కరెంట్ కావాలంటే ..ఇవన్నీ తెలుసుకోవాల్సిందే ..!!