BJP National Meet :ఢిల్లీలో మోడీ భారీ రోడ్ షో, బీజేపీ స‌మావేశాల్లో `ముంద‌స్తు`?

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం(BJP National Meet)తీర్మానాల‌ను చేయ‌నుంది.

  • Written By:
  • Publish Date - January 16, 2023 / 02:59 PM IST

ఢిల్లీ కేంద్రంగా జ‌రుగుతోన్న రెండు రోజుల బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం(BJP National Meet) కీల‌క తీర్మానాల‌ను చేయ‌నుంది. కేంద్రం ముంద‌స్తు(Before elections)ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న ఉందా? లేదా? అనే చ‌ర్చ‌కు ఈ స‌మావేశం దాదాపుగా తెర వేయ‌నుంది. అంతేకాదు, బీజేపీ అధ్యక్షుడు న‌డ్డా ప‌ద‌వీకాలాన్ని పొడిగించే అంశంపై క్లారిటీ రానుంది. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యంపై కీల‌క తీర్మానాల‌ను ఈ స‌మావేశం ఆమోదించ‌నుంది. స‌మావేశానికి ముందుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ రాజ‌ధాని కేంద్రంగా భారీ ర్యాలీకి బీజేపీ ఏర్పాట్లు చేసింది. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపు విజ‌యోత్స‌వం మాదిరిగా నిర్వ‌హించే ఈ రోడ్ షో ద్వారా రాబోవు ఎన్నిక‌ల్లో మూడోసారి ప్ర‌ధాన మంత్రిగా న‌రేంద్ర మోడీ పీఠం ఎక్క‌బోతున్నార‌నే సంకేతం బీజేపీ ఇవ్వడానికి సిద్ధమ‌యింది.

బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం(BJP National Meet)

భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశానికి(BJP National Meet) ఢిల్లీ ముస్తాబ‌యింది. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా జేపీ నడ్డా మూడేళ్లుగా ఉంటున్నారు. ఈనెలాఖ‌రు నాటికి ఆయ‌న‌ పదవీకాలం ముగియ‌నుంది. ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని రెండో విడ‌త‌ పొడిగించేందుకు అవ‌కాశం ఉంది. కానీ, ఇటీవ‌ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిల్లో ఓటమి త‌రువాత న‌డ్డాను మార్చేస్తార‌ని బీజేపీలోని ఒక వ‌ర్గం భావిస్తోంది. గుజ‌రాత్ ఎన్నిక‌ల ద్వారా బీజేపీ నూత‌నోత్సాహాన్ని పొందించింది. రాబోవు ఎన్నిక‌ల్లోనూ (2024) బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుంద‌ని గుజ‌రాత్ ఫ‌లితాల ద్వారా (Before elections)సంకేతాలు ఇవ్వ‌గా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో అధికారాన్ని కోల్పోవ‌డం ఆ పార్టీకి మైన‌స్. అందుకు బాధ్యునిగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా నిలుస్తార‌ని కొంద‌రు ఊహిస్తున్నారు. కానీ, ఆయ‌న్ను మ‌రోవిడ‌త జాతీయ అధ్య‌క్షునిగా కొన‌సాగిస్తార‌ని బీజేపీలోని మ‌రో వ‌ర్గం భావిస్తోంది.

Also Read : T BJP : ఈటెల‌కు బీజేపీ ప‌గ్గాలు, కేంద్ర మంత్రిగా `బండి`?

ఈ ఏడాది జ‌రిగే అసెంబ్లీ, రాబోవు సార్వత్రిక ఎన్నికల వ్యూహంపై ప్ర‌ధానంగా రెండు రోజుల బీజేపీ జాతీయ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. సాయంత్రం దేశ రాజధానిలో ప్రారంభమ‌య్యే ఈ స‌మావేశం తీసుకునే నిర్ణ‌యాల ఆధారంగా రాబోవు రాజ‌కీయ ప‌రిణామాలు ఆధార‌ప‌డి ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లతో న‌డ్డా సమావేశం నిర్వ‌హించ‌బోతున్నారు. న్యూ ఢిల్లీలోని మున్సిపల్ కౌన్సిల్క న్వెన్షన్ సెంటర్‌లో అనేక థీమ్‌లతో కూడిన గ్రాండ్ ఎగ్జిబిషన్‌ను న‌డ్డా ప్రారంభిస్తారు.

కేంద్రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న ఉందా?  

జాతీయ సమావేశం ప్రారంభానికి ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ ఢిల్లీలోని పటేల్ చౌక్ నుండి NDMC ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. సుమారు ఒక కిలోమీటరు పాటు రోడ్‌షో నిర్వహించడానికి బీజేపీ క్యాడ‌ర్ సిద్ధ‌మ‌యింది. జాతీయ కార్యవర్గంలో మోడీతో పాటు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది ముఖ్యమంత్రులు, 37 మంది ప్రాంతీయ అధిపతులు ఉంటారు. 350 మంది పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.

ప‌లు థీమ్ ల ఆధారంగా ఎగ్జిబిష‌న్ల ను ఏర్పాటు చేయ‌డం ఈ స‌మావేశాల్లోని హైలెట్ పాయింట్. మొద‌టి ఎగ్జిబిషన్ థీమ్ “సేవా, సంగతన్, ఔర్ సమర్పన్ (సేవ, సంస్థ మరియు అంకితభావం)ష‌. రెండవ థీమ్ — “విశ్వ గురు ఇండియా” కోవిడ్‌పై ప్రపంచ పోరాటంలో భారతదేశం సహకారాన్ని మరియు G20 ప్రెసిడెన్సీని కలిగి ఉంటుంది. మూడవ థీమ్, “ముందుగా మంచి పాలన”, మెరుగైన పాలనను నిర్ధారించడానికి తీసుకున్న చర్యలను ప్రదర్శిస్తుంది.

ప్రధాని రోడ్డు షో

అణగారిన, సమ్మిళిత మరియు బలమైన భారతదేశానికి సాధికారత కల్పించడం, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం, ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం పెరుగుదల వంటి పురాతన చిహ్నాలను పరిరక్షించడం వంటి ఇతర కార్యక్రమాలు ఇతర ఇతివృత్తాలుగా ఎగ్జిబిష‌న్ లు ప్రదర్శించబడతాయి. రాజకీయ , ఆర్థిక అంశాలు కూడా చర్చించబడతాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో సంస్థాగత సమస్యలు పరిశీలిస్తారు.

Also Read : Modi Bridge : సముద్రం మీద మోడీ మార్క్‌ బ్రిడ్జి! దేశానికే త‌ల‌మానికం!

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్లు సమావేశాలకు హాజరు కానున్నారు. మొత్తం మీద 350 మందికి ప్రవేశం ఉంటుంది. ఢిల్లీలో భారీ రోడ్డు షో పటేల్ చౌక్ నుంచి పార్లమెంట్ వీధి వరకు రోడ్డు షో ఉంటుంది. ఎన్ డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని రోడ్డు షో, బీజేపీ జాతీయ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణకు ఆంక్షలు పెట్టారు. గుజరాత్ లో భారీ విజయం తర్వాత బీజేపీ జాతీయ సమావేశాలు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. ఇటీవలి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నరేంద్ర మోదీ తిరిగి 2024లో కూడా ప్రధాని అవుతారన్న సందేశాన్ని ఇచ్చినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో క్యాడ‌ర్ ను ముందుకు క‌దిపేలా దిశానిర్దేశం ఈ స‌మావేశం ఇవ్వ‌నుంది. ఆ మేర‌కు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకునే అవ‌కాశం ఉంది.