Site icon HashtagU Telugu

Rakesh Tikait: రాకేష్ టికాయత్ ఎన్కౌంటర్ అయ్యేవాడు

Rakesh Tikait

Rakesh Tikait

Rakesh Tikait: బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న సందర్భంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ రైతుల్లో లేకుంటే ఎన్ కౌంటర్ అయ్యేవన్నారు.

దేశాన్ని పాలించిన మొఘలులు, బ్రిటీషర్ల తర్వాత దేశాన్ని బానిసలుగా మార్చేందుకు టికాయత్ కృషి చేశారని అన్నారు. ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జర్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలు అమలులో ఉండి ఉంటే రైతుల బతుకులు మారేవని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకొచ్చిన బిల్లు వల్ల రైతులకు మధ్య దళారుల నుంచి విముక్తి లభించిందని చెప్పారు. రాకేష్ టికాయత్ రైతులను మోసం చేశారన్నారు. ఆయన చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోతారు. ఖలిస్థానీలు, కమీషన్ ఏజెంట్ల సహకారంతో టికాయత్ చేసిన అకృత్యాలను చూసి రైతులు రానున్న రెండేళ్లలో అతడిని గ్రామంలోకి రానివ్వడం లేదని స్పష్టం చేశారు.

రాకేష్ టికాయత్ ఖలిస్తాన్ జెండాను ఎగురవేసి త్రివర్ణ పతాకాన్ని అవమానించారని అన్నారు. దేశ చరిత్రలో ఇంత నీచమైన పని ఎవరూ చేయలేదన్నారు. రాకేష్ టికాయత్ రైతు వేషంలో లేకుంటే ఇప్పటికే ఎన్ కౌంటర్ అయ్యేవాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో నందకిషోర్ గుర్జార్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read: Paneer : మీరు ఈ ఫోటో చూస్తే..జీవితంలో పన్నీర్ తినరు..