Site icon HashtagU Telugu

Amit Shah on Adani: బీజేపీ భయపడేది లేదు.. అదానీ ఇష్యూపై ‘షా’ రియాక్షన్!

Amit Shah And Adani

Amit Shah And Adani

హిండెన్‌బర్గ్-అదానీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై ప్రతిపక్షాలు బిజెపి (BJP) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. పార్లమెంట్ లో మోడీని సైతం టార్గెట్ చేయడంతో ఆయన తెలివిగా సమాధానమిచ్చారు. తాజాగా  కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అదానీ అంశం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లినందున తాను మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. అయితే ఇందులో బీజేపీ దాచడానికి ఏమీ లేదు, భయపడాల్సిన పనిలేదు’ అని షా ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

హిండెన్‌బర్గ్-అదానీ (Adani) వివాదం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడంతో పెద్ద రాజకీయ వివాదంగా మారింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంపై విపక్షాలు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేశాయి. అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసీ, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడులపై వారు ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే. బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న “క్రోనీ క్యాపిటలిజం” ఆరోపణపై షా (Amit Shah) స్పందించారు. “బీజేపీపై ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేకపోయారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వలు ఏజెన్సీలను తమ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. అప్పట్లో 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి’’ అని షా తేల్చి చెప్పారు.

కాంగ్రెస్, బిజెపి ఇతర ప్రతిపక్ష పార్టీలు “సంస్థలను స్వాధీనం చేసుకున్నాయి” అనే ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు, కోర్టులు బిజెపి ప్రభావంతో లేవని వారు కోర్టుకు వెళ్లాలని అమిత్ షా (Amit Shah) ధీటుగా బదులిచ్చారు. “వారు కోర్టుకు ఎందుకు వెళ్లరు? పెగాసస్ సమస్య లేవనెత్తిన సమయంలో కూడా, నేను కోర్టుకు రుజువులతో వెళ్లమని చెప్పాను’ అని షా అన్నారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదికను అనుసరించి పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేసేందుకు సెబీ అంగీకరించిందని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి కమిటీని నియమించడంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని మెహతా చెప్పారు. అయితే, కమిటీ అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంది కాబట్టి, ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో పేర్లను అందజేస్తుందని ఆయన చెప్పారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల చేసిన ప్రసంగం గురించి అడిగిన ప్రశ్నకు షా బదులిస్తూ.. ఇది దాదాపు పూర్తిగా అదానీ గ్రూపుకు సంబంధించినది, రాహుల్ ఏ ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాడో స్క్రిప్ట్ రైటర్‌లు నిర్ణయించుకోవాలని అమిత్ షా అన్నారు.

Also Read: Drunkers: కేరళ పోలీసుల పనిష్ మెంట్.. మందుబాబులకు వింత శిక్ష!

Exit mobile version