Site icon HashtagU Telugu

Hindi Belt : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ లీడ్

Hindi Belt

Hindi Belt

Hindi Belt : మధ్యప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో దూసుకుపోతున్నారు. ఈ రాష్ట్రంలోని 230 స్థానాలకుగానూ 148 చోట్ల బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో 82 చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల  ఇతరులు లీడ్‌లో ఉన్నారు. దీన్నిబట్టి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే బీజేపీ ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు రాజస్థాన్‌లోని మొత్తం 199 స్థానాలకుగానూ 103 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 75 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 21 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. దీన్నిబట్టి ఈ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ చివరి వరకు ఇదే  ట్రెండ్ కొనసాగితే.. స్వతంత్రులు, చిన్నపార్టీల అభ్యర్థులు కీలకంగా మారనున్నారు. ఈనేపథ్యంలో శనివారం రోజు నుంచే వారితో కాంగ్రెస్, బీజేపీ మంతనాలు ప్రారంభించాయి. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎటువైపు ఎక్కువ మంది చిన్నపార్టీల క్యాండిడేట్స్, స్వతంత్రులు మొగ్గుచూపుతారనేది వేచిచూడాలి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో బీఎస్పీతో పాటు పలు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Also Read: Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!

ఇక ఛత్తీస్‌గఢ్‌లో 50 చోట్ల బీజేపీ, 39 చోట్ల కాంగ్రెస్ లీడ్‌లో ఉన్నాయి.  ఈ రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లలో 46 సీట్లను సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓట్ల కౌంటింగ్ ముగిసే సమయానికి ట్రెండ్ ఎలా మారుతుంది ? ఏం జరుగుతుంది ? అనేది ఛత్తీస్‌గఢ్‌లో(Hindi Belt) ఉత్కంఠ రేకెత్తిస్తోంది.