Site icon HashtagU Telugu

Navya Haridas : వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్

Navya Haridas

Navya Haridas

కేరళలోని వయనాడ్ లోక్సభ ఉపఎన్నిక( Wayanad Lok Sabha by-poll)కు బీజేపీ తమ అభ్యర్థి (BJP Candidate)ని ప్రకటించింది. నవ్య హరిదాస్ (Navya Haridas) పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థితో పాటు అస్సాం, బిహార్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, కేరళ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలకూ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

నవ్య.. హెచ్‌ఎస్‌బీసీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఇంజనీర్‌గా పని చేసిన ఆమె.. ప్రజా సేవ చేసేందుకు ఉద్యోగాన్ని వదులుకుని బీజేపీ పార్టీలో చేరారు. కోజికోడ్ కార్పొరేషన్‌లో వరుసగా రెండో సారి బీజేపీ కౌన్సిలర్‌గా ఉన్నారు. గత కొంతకాలంగా ఆమె ఐజెపి లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇక నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also : Group 1 Exams : ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన గ్రూప్-1 పరీక్షలు ఆగవు – సీఎం రేవంత్