Rahul Gandhi Passport: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన ప్రకటనలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆయన పాస్‌పోర్ట్(passport)ను రద్దు చేయాలని బీజేపీ (bjp) డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలో బీజేపీ చిత్తోర్‌గఢ్ ఎంపీ సీపీ జోషి( cp joshi) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో రాహుల్ గాంధీ (rahul gandhi) తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సీపీ జోషి ఏం చెప్పారు?
బాధ్యతాయుతమైన భారత పౌరుడిగా రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై చేసిన ప్రకటనలు ఏ విధంగానూ సరికావని జోషి అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత పదవిని దుర్వినియోగం చేస్తున్నందున దేశ అంతర్గత సుస్థిరత, సరిహద్దుల భద్రత, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. “రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రాజకీయం మాత్రమే కాదని, అవి తన ప్రవర్తనపై ఆందోళన కలిగించే దేశ వ్యతిరేక కార్యకలాపాలను కలిగి ఉన్నాయని చెప్పారు. రాహుల్ తన ప్రవర్తనతో తన పదవిని కూడా దుర్వినియోగం చేస్తున్నాడు అని జోషి తన లేఖలో పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రకటనలను సమర్థించలేమని, రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. పర్యవసానంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా తన ముఖ్యమైన పాత్రకు రాజీనామా చేయడం తప్పనిసరి అని జోషి అన్నారు.
రాజస్థాన్ బిజెపి ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్యే జితేంద్ర గోత్వాల్ జోషి డిమాండ్‌కు మద్దతు ఇచ్చారు. రాహుల్ గాంధీ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో పాటు, అతని పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని సూచించారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చేందుకు గాంధీ ప్రయత్నించారని గోత్వాల్ ఆరోపించారు.
వివాదం ఎలా మొదలైంది?
ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. తన పర్యటనలో రాహుల్ భారతదేశంలో నిరుద్యోగం మరియు ఆర్‌ఎస్‌ఎస్ పాత్రపై వ్యాఖ్యలు చేశారు, ఇది బిజెపి మరియు దాని మిత్రపక్షం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారతదేశంలో సిక్కుల పరిస్థితి మరియు రిజర్వేషన్ల గురించి కూడా రాహుల్ మాట్లాడారు. విదేశీ గడ్డపై ఆయన చైనాను ప్రమోట్ చేస్తున్నారని మరియు భారతదేశాన్ని అణగదొక్కారని బిజెపి ఆరోపించింది. విదేశాలలో చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధిని భారతీయ ప్రజాస్వామ్యంలో బిజెపి బ్లాక్ స్పాట్ అని కూడా పేర్కొంది.
Also Read: CM Chandrababu : సీఎం సహాయనిధికి రూ.400 కోట్లు రావడం ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు