BJP : రాహుల్ గాంధీ వాజ్ పేయి సమాధి సందర్శన పై బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ‘సదైవ్ అటల్’ సందర్శన విమర్శలకు దారితీసింది. అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా వాజ్ పేయి సమాధిని సందర్శించి రాహుల్ నివాళులు అర్పించారు. దీనిపై బీజేపీ (BJP) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజాయితీ ముందు అవినీతి మోకరిల్లుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. అంతకుముందు వాజ్ పేయిపై కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ పంది చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.

కాంగ్రెస్ నేత గౌరవ్ పంది ఇటీవల వాజ్ పేయిని బ్రిటీష్ పాలకుల ఇన్ఫార్మర్ అని ఆరోపించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వాజ్ పేయి బ్రిటీషర్లకు ఇన్ఫార్మర్ గా చేశాడని విమర్శించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వాజ్ పేయి బాయ్ కాట్ చేయడమే కాకుండా అందులో పాల్గొన్న వారి వివరాలను బ్రిటీష్ పాలకులకు అందించాడని గౌరవ్ పంది ఆరోపించారు.

గౌరవ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ పార్టీతో పాటు గౌరవ్ క్షమాపణ చెప్పాలని బీజేపీ (BJP) నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఢిల్లీలోని వాజ్ పేయి సమాధిని సందర్శించడంతో నిజాయితీ ముందు అవినీతి మోకరిల్లుతోందని బీజేపీ నేతలు అంటున్నారు.

Also Read:  Vegetables Expiry Time : ఎన్ని రోజులు కూరగాయలు నిల్వ ఉంటాయి?