Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం: బీజేపీ

Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్‌ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు

Published By: HashtagU Telugu Desk
Kejriwal Resignation

Kejriwal Resignation

Kejriwal Resignation: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్‌ చేసిన ఈ ప్రకటనపై సోషల్‌మీడియాలో ఘాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల మద్దతు గురించి కేజ్రీవాల్ (Arvind Kejriwal) సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకి నెగటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అవినీతి రాజు ఇప్పుడు ప్రజలకు అవినీతి ఎలా చేయాలో నేర్పిస్తాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మీ హయాంలో ఢిల్లీ నాశనమైందని మరో వినియోగదారు తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ దుష్పరిపాలన నుండి ఉపశమనం పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నారని చేసిన ఓ కామెంట్ వైరల్ అవుతుంది. మరొక వినియోగదారుడు ఓ ముందడుగేసి జైలుకు వెళ్లాల్సిన రోజునే కేజ్రీవాల్ రాజీనామా చేసి ఉండాల్సిందన్నాడు.

కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్‌ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. అధికారికంగా విధులు నిర్వర్తించకుండా సుప్రీంకోర్టు నిషేధించిన మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటూ విమర్శించారు.

ఢిల్లీ భాజపా(Delhi BJP) అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల మధ్యకు వెళ్తానని చెబుతున్నారని, అయితే కేజ్రీవాల్ని ఢిల్లీ ప్రజలు మూడు నెలల క్రితమే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. జూన్‌లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని సీఎం కోరినప్పుడు నగర ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని కేజ్రీవాల్‌పై బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ప్రతిపక్ష కూటమి నగరంలోని మొత్తం 7 స్థానాలను కోల్పోయిందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ చేసేది త్యాగం కాదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగానే అతను రాజీనామా చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా ఏ ఫైల్‌పై సంతకం చేయలేరు కాబట్టి చేసేదేం లేక పదవికి రాజీనామా చేస్తున్నట్లు విమర్శించారు.

Also Read: Bone Density: మ‌న ఎముక‌ల‌కు హాని చేసే ప‌దార్థాలు ఇవే..!

  Last Updated: 15 Sep 2024, 03:24 PM IST