Site icon HashtagU Telugu

Bird flu Detected in Cats : వామ్మో.. పిల్లులకు కూడా బర్డ్ ఫ్లూ!

Bird Flu In Cats

Bird Flu In Cats

బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) సాధారణంగా కోళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా(Madhya Pradesh’s Chhindwara district)లో ఓ పెంపుడు పిల్లి(Cat )లో ఈ వైరస్ బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇది దేశంలో తొలిసారి నమోదైన కేసుగా గుర్తించబడింది. కోళ్లలో ఈ వైరస్ ప్రబలిన వేళ, ఇప్పుడు పిల్లుల్లోనూ కనిపించడం ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Jasprit Bumrah: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున బుమ్రా ఆడ‌తాడా?

కరోనా వైరస్ మాదిరిగానే ఈ H5N1 వైరస్ కూడా నిరంతరం ఆకృతి మార్చుకుంటూ పరిణామాలను చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే అవకాశముందని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పక్షులు, పిల్లులు, ఇతర జంతువులతో నేరుగా సంబంధం ఉండే వారికి మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Central Taxes: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై రాష్ట్రాల‌కు ప‌న్ను వాటా త‌గ్గింపు?

అమెరికా సహా పలు దేశాల్లో ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పటికే జంతువుల ద్వారా మనుషులకు సోకిన ఘటనలు నమోదయ్యాయి. ఇప్పుడు భారత్‌లోనూ ఇది పిల్లుల్లో కనుగొనబడటం తీవ్రమైన పరిస్థితికి దారి తీయవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు, పశుసంవర్థక శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా, ముందస్తు జాగ్రత్తలు పాటించడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.