Site icon HashtagU Telugu

Bihar Woman: దారుణం.. మహిళ అవయవాలు కోసి కిరాతకంగా హత్య

Son Killed Father

Crime Scene

బీహార్‌లోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో భయానక కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని భాగల్‌పూర్ (Bhagalpur) జిల్లాలో ఒక మహిళను పదునైన ఆయుధంతో బహిరంగంగా నరికి చంపారు. జిల్లాలోని పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మొత్తం కేసును పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

నీలం దేవి అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం తన కుటుంబ సన్నిహితుడైన షకీల్ మియాన్ నుంచి డబ్బును అప్పుగా తీసుకుంది. అయితే ఆ అప్పును తిరిగి ఇవ్వలేకపోయింది. దీంతో కోపం పెంచుకున్న అతడు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతమైన భాగల్‌పూర్‌లో పట్టపగలు పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఆమె చేతులు, రొమ్ములు, చెవులు నరికివేశాడు. అలాగే వీపుపై దాడి చేశాడు. తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Also Read: Madhya Pradesh : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బోరుబావిలో ప‌డ్డ బాలుడు.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆప‌రేష‌న్‌

మృతురాలి కుటుంబ సభ్యులు ఈ కేసులో ఇద్దరిని నిందితులుగా చేశారని భాగల్‌పూర్ ఎస్పీ బాబూరామ్ తెలిపారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భర్త అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. నిందితుడు షకీల్ మియాన్ తన ఇంటికి తరచూ వస్తుంటాడని, ఆర్థిక సమస్యలతో గొవడలు జరిగేవని పేర్కొన్నాడు.