Viral News : బీహార్ రాష్ట్రంలోని పూర్నియా జిల్లాలో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ విషయంలో రెండు స్కూల్ విద్యార్థినుల మధ్య తీవ్ర గొడవ చోటుచేసుకోవడం, ఆ తర్వాత అది హింసాత్మకంగా మారడం స్థానికంగా సంచలనంగా మారింది. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమించడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన పూర్నియాలోని గులాబ్‌బాగ్ హాన్స్‌దా రోడ్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద జరిగింది. సమాచారం ప్రకారం, ఒకే అబ్బాయితో ఇద్దరు విద్యార్థినులు ప్రేమలో ఉన్నారు. దీని గురించి తెలియడంతో ఇద్దరూ బహిరంగంగా రోడ్డుపై గొడవకు దిగారు. తొలుత మాటల యుద్ధంగా మొదలైన ఈ ఘర్షణ, కొంతసేపటికి తీవ్ర స్థాయికి చేరింది.
స్నేహితులను వెంట తెచ్చుకుని రోడ్డుపైకి వచ్చిన ఈ విద్యార్థినులు మొదట మాటలతో పరస్పరం విమర్శించుకున్నాయి. ఆ తర్వాత తీవ్ర ఆగ్రహంతో ఒకరిపై ఒకరు దాడి చేయడం మొదలుపెట్టారు. జుట్టు పట్టుకుని లాకడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం వంటి ఘటనలు అక్కడే ఉన్న స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. విద్యార్థినులు స్కూల్ యూనిఫామ్‌లో ఉండటం ఈ ఘటనను మరింత ఆందోళనకరంగా మారింది.
Nani : నాని ప్యారడైజ్.. అందులో నిజమెంత..?
ఈ ఘటనను చూస్తున్న స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థినులను విడదీశారు. అయితే అప్పటికే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి చేరాయి. కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియోలు వైరల్ అవడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ సంఘటనపై సదర్ పోలీస్‌స్టేషన్ అధికారి అజయ్ కుమార్ స్పందించారు. ఈ ఘర్షణపై విచారణ కొనసాగుతోందని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందజేసి, వారిని హెచ్చరించామని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన విద్యార్థుల ప్రవర్తనపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో చదువుకునే వయసులో ఉన్న విద్యార్థినులు ఇలాంటి సంఘటనలకు పాల్పడటం ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం కుటుంబ సభ్యుల బాధ్యత మాత్రమే కాకుండా, విద్యా సంస్థలు, సమాజం కూడా చర్చించాల్సిన సమస్యగా మారింది.
విద్యార్థుల నడవడిక, వారిపై సోషల్ మీడియా ప్రభావం, మారుతున్న సమాజపు విలువలు – ఈ ఘటనలో ప్రతిబింబించాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల మీద మరింత నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Telugu States : రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చబోతున్న ‘అమృత్ స్టేషన్ పథకం’