ఇసుక మాఫియా గ్యాంగ్ (Sand Mafia Gang) రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అధికారులకు లంచాలు ఇస్తూ దందాకు పాల్పడుతున్నారు. ఈ ఇసుక మాఫియా అనేది అన్ని చోట్ల విచ్చలవిడి అయ్యింది. ఎవరైనా అడ్డు చెపితే ప్రాణాలు తీయడానికైనా సిద్దపడుతున్నారు. తాజాగా బీహార్ (Bihar ) లో అలాగే చేసారు. ఓ ఇసుక మాఫియా గ్యాంగ్ ఎస్ఐ పై ట్రాక్టర్ ఎక్కించి అతి దారుణంగా చంపేశారు. బిహార్ లోని జాముయి (Jamui ) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
బిహార్ లోని సివన్ జిల్లా వాసి అయినా ప్రభాత్ రంజన్ (Jamui SI Prabhat Ranjan).. గర్హి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో జాముయి జిల్లాలో ఇసుక మాఫియా ఎక్కువ అవుతుందని పిర్యాదులు అందడంతో..ప్రభాత్ రంజన్ ఇసుక మాఫియా ను అడ్డుకోవాలని యత్నించాడు. దీంతో ప్రభాత్ రంజన్ అడ్డు తొలగించుకోవాలని భావించిన మాఫియా గ్యాంగ్..అతి కిరాతకంగా ప్రభాత్ రంజన్ ఫై ఇసుక ట్రాక్టర్ ఎక్కించి ప్రాణాలు తీశారు. ఈ ఘటన లో హోం గార్డు రాజేశ్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకుంటున్నామని బిహార్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఎస్ఐ ప్రాణాలు తీసిన డ్రైవర్ ను గుర్తించామని, నవాడా జిల్లాకు చెందిన అతడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని జాముయి డీఎస్పీ అభిషేక్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆ ట్రాక్టర్ ను సీజ్ చేశామని తెలిపారు. ఈ నేరంలో పాలు పంచుకున్న ఇతరులను కూడా గుర్తించామన్నారు.
Read Also : Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!