Bihar Politics: రసవత్తరంగా బీహార్ రాజకీయాలు.. ఆర్జేడీ దారెటు?

రాజకీయాల్లో తిరుగుబాట్లతో పేరొందిన నితీష్ కుమార్ మరోసారి బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఈ రోజు జనవరి 28న సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ మహాకూటమి నుంచి బయటకొచ్చారు.

Bihar Politics: రాజకీయాల్లో తిరుగుబాట్లతో పేరొందిన నితీష్ కుమార్ మరోసారి బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఈ రోజు జనవరి 28న సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ మహాకూటమి నుంచి బయటకొచ్చారు. విశేషమేంటంటే లాలూ-తేజస్వీని వదిలి నితీష్ ఎన్డీయేలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇప్పుడు అందరి చూపు లాలూ-తేజశ్విలపైనే పడింది.

మహాకూటమి ప్రభుత్వంలో పనిచేయడం కష్టంగా మారిందని రాజీనామా అనంతరం నితీశ్ కుమార్ అన్నారు. నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రీయ జనతాదళ్ లో కూడా కలకలం రేగింది. నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారు. మరిప్పుడు లాలూ మరియు తేజస్వీ యాదవ్ వ్యూహం ఏమిటి?

ఆదివారం రాజీనామా చేయడానికి ముందు శనివారం పాట్నాలో తీవ్ర రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. నితీష్ కుమార్ మౌనంగా ఉండడంతో రాజకీయాలు హీటెక్కాయి. తేజస్వి యాదవ్ మరియు లాలూ యాదవ్ కూడా ఈ విషయాన్నీ ముందే పసిగట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన నేతలు, ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తేజస్వీ యాదవ్ అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రీయ జనతాదళ్ భవిష్యత్తు వ్యూహం కూడా తేలింది. నితీష్ కుమార్ ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చని తేజస్వీ యాదవ్ అర్థం చేసుకున్నారు. భావోద్వేగమయ్యాడు. ప్రజలు మాకు న్యాయం చేస్తారంటూ ఎమోషనలయ్యాడు.

రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ భవిష్యత్తు గురించి మాట్లాడడం సరికాదని, అయితే ప్రజారాజ్యమే మా గుర్రమని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని తేజస్వీ యాదవ్ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. మన పరిమితులను మనం మరచిపోకూడదన్నారు. నితీష్ వైఖరి చూసి తేజస్వి యాదవ్ కూడా తన ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. 15నెలలుగా మహాకూటమి ప్రభుత్వం చేసిన కృషితో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ సమావేశంలో అన్నారు. అయితే నితీష్ కుమార్‌ను ఆర్‌జేడీ ఎప్పుడూ గౌరవిస్తుందని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా ఆమోదిస్తారని తేజస్వి అన్నారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు, 15 నెలల్లో మహాకూటమి ప్రభుత్వం చేసిన కృషిని విస్తృతంగా ప్రచారం చేయండి. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించాం. ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉద్యోగుల హోదా కల్పించారు.శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల జాబితాను రూపొందించారు. ఈ పనులకు సంబంధించి ప్రచారం చేయాల్సిందిగా కోరాడు. మనం మన ఆదర్శాలను మరచిపోకూడదు. ప్రజల కోసం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండాలి. ఎమ్మెల్యేలు ఏది కావాలంటే అది చేయనివ్వండి అని అన్నారు.

Also Read: Biden Deepfake : ‘‘నాకు ఓటు వేయొద్దు’’.. బైడెన్‌ ఆడియో క్లిప్ కలకలం