Site icon HashtagU Telugu

Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్

Bihar Floor Test

Bihar Floor Test

Bihar Floor Test: మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్‌ను ప్రతిపాదించనున్నారు. ఫ్లోర్ టెస్ట్ లో నితీష్ ఫెయిల్ అయితే ఏమవుతుంది.. ఈ ఫ్లోర్ టెస్ట్ ఎలా చేస్తారు అన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.

ఏదైనా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రికి విశ్వాస తీర్మానాన్ని సమర్పించడానికి ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తారు. దీన్ని బట్టి సీఎంకు అసెంబ్లీలో మెజారిటీ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇది పార్లమెంటు మరియు అసెంబ్లీ రెండింటిలోనూ జరుగుతుంది. ఈరోజు నితీష్ కుమార్ బలపరీక్ష నిర్వహించి తనకు అవసరమైన మెజారిటీ ఉందని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి మెజారిటీ ఉందన్న ప్రశ్నలు తలెత్తినప్పుడల్లా, మెజారిటీ క్లెయిమ్ చేసే సీఎం తన ఎమ్మెల్యేలందరు ఓటు వేయాలి. అయితే అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల ఓట్లను మాత్రమే లెక్కిస్తారు.

మెజారిటీ పరీక్షలో ముఖ్యమంత్రి విఫలమైతే రాజీనామా చేయాల్సి ఉంటుంది.ఫ్లోర్ టెస్ట్ ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్వహిస్తారు. ఇందులో గవర్నర్ పని ఉత్తర్వులు ఇవ్వడం మాత్రమే. ఇందులో గవర్నర్ పాత్ర ఉండదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి హాజరై ఓటు వేస్తారు. బలపరీక్షలో నెగ్గితే నితీష్ సీఎంగా కొనసాగుతాడు.

కాగా క్యాంపు నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరుకోగా.. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాట్నాకు చేరారు. అయితే జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు 10మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవటంతో బలపరీక్ష పై ఉత్కంఠ నెలకొంది.

Also Read: Harish Shankar: నెగిటివ్ వార్తలపై ఘాటుగా స్పందించిన హరీష్ శంకర్.. దమ్ముంటే నా ఫోటో పెట్టి రాయండి అంటూ?