బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) సంచలన ప్రకటన చేసారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ అమలులోకి రానుంది. ఇది మహిళల ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో తీసుకున్న స్ట్రాటజీగా విశ్లేషకులు భావిస్తున్నారు.
Rajasthan : సోషల్ మీడియా మోజు..ఆరేళ్ల కుమార్తెతో డేంజర్ స్టంట్
ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్న నితీశ్ ప్రభుత్వం, ఇటీవల సామాజిక పెన్షన్‌ను పెంచుతూ మరో కీలక నూతన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రూ.400గా ఉన్న పెన్షన్‌ను రూ.1100కు పెంచారు. పెరిగిన పెన్షన్ జూలై నెల నుంచే అమలులోకి వచ్చిందని, జూలై 10న అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెన్షన్ పెంపుతో మహిళా వర్గంలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది.
KTR : కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా – అద్దంకి దయాకర్
ఈ రెండు నిర్ణయాలు నితీశ్ కుమార్ తిరిగి అధికారం సాధించాలనే లక్ష్యంతో తీసుకున్న వ్యూహాత్మక చర్యలుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహిళల ఓట్లు ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తూ, వారి మద్దతును పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. మహిళలకు రిజర్వేషన్‌తో పాటు పెన్షన్ పెంపు నిర్ణయాల ద్వారా ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం తన బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది.