సింధు నదీ జలాల (Indus Plan) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద పథకానికి శ్రీకారం చుట్టింది. NDTV నివేదిక ప్రకారం.. సింధు, జీలం, చినాబ్ నదుల్లో ఉన్న మిగులు జలాలను పంజాబ్, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాలకు మళ్లించేందుకు కేంద్రం కొత్తగా 113 కిలోమీటర్ల మేర కాల్వలు (113km Canal) తవ్వనుందని సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర భారతదేశానికి త్రాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ATMs : ఆర్‌బీఐ గడువుకు ముందే పురోగతి..ఏటీఎంల్లో పెరిగిన రూ.100, రూ.200 నోట్ల లభ్యత
ఇందులో భాగంగా కేంద్ర జలవనరుల శాఖ ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం ప్రారంభించిందని అధికారులు వెల్లడించారు. సింధు జలాల ప్రస్తుత ప్రవాహ మార్గం, అందుబాటులో ఉన్న మిగులు నీటి వనరులపై డీటెయిల్ స్టడీ చేస్తున్నారు. ఈ కాల్వల ద్వారా మూడు నదులను అనుసంధానించేలా డిజైన్ చేయాలని కేంద్ర యోజన. సింధు జలాల వినియోగాన్ని మెరుగుపరచడమే కాక, వినియోగించని నీటిని వృథా కాకుండా ఉపయోగించాలన్నదే ఈ ప్రణాళిక వెనుక ఉద్దేశం.
Israel-Iran Conflict : పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత
ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, ఇది భారత్-పాకిస్తాన్ (Ind -Pak) మధ్య ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా భారతదేశపు వాటాను పూర్తిగా వినియోగించుకునే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.