ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi ), ఆయన భార్య సోనమ్ (Sonam) ఇటీవల తమ హనీమూన్ (Honeymoon ) కోసం మేఘాలయ(Meghalaya )కు వెళ్లారు. అయితే అక్కడ రాజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని భార్య సోనమ్ ఆ వెంటనే అదృశ్యమైంది. ఈ ఘటన మేఘాలయను మరియు దేశవ్యాప్తంగా ప్రజలను షాక్ కు గురి చేసింది. తొలుత ఇది ప్రమాదమా? లేక కుట్రా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Dry Fish : ఎండు చేపలు తింటే ఎన్ని “ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
తాజాగా మేఘాలయ పోలీసులు చేసిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజాను హత్య చేయించేందుకు భార్య సోనమే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సోనమ్‌తో పాటు నలుగురు నిందితులను ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరిని యూపీ నుంచి, మిగతా ఇద్దరిని ఇండోర్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకున్నది.
Lucky : అదృష్టం అంటే ఇతడిదేపో.. రూ.లక్ష పెట్టి రూ.80 కోట్లు కొట్టేసాడు
మేఘాలయ డీజీపీ ఐ. నోంగ్రాంగ్ ఈ కేసు వివరాలను వెల్లడించగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ కేసును సత్వరంగా ఛేదించిన పోలీసులను అభినందించారు. సోనమ్ ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందని నిందితుల ఆరోపణలు స్పష్టం చేసాయి. మూడు రాష్ట్రాల పోలీసు బృందాలు కలిసి ఈ కేసును ఛేదించగా, ప్రస్తుతం ఇంకా ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు. మొత్తంగా ఈ హనీమూన్ ట్రిప్ ఒక దారుణ హత్యకు వేదికగా మారడం బాధాకరం.