భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నిలిచింది. లండన్(London)కు బయలుదేరిన విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘనినగర్ సమీపంలో కూలిపోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. విమానం ఒక్కసారిగా గాల్లో అదుపు కోల్పోయి చెట్టును ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. గాలిపటం ఒక్కసారిగా దారం తెగితే ఎలాగైతే నేలపై పడిపోతుందో..ఆ విధంగా ఈ విమానం కూడా కూలింది.
Flight Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రధాని మోడీ ఆరా
ఈ ప్రమాదానికి గల కారణాలపై విమానయాన నిపుణులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్రోహ చర్య జరిగి ఉంటే విమానం గాల్లోనే పేలిపోయే అవకాశం ఉండేదని, కానీ అది జరగలేదని స్పష్టం చేశారు. టేకాఫ్ అయిన వెంటనే ఏదైనా సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. విమానం కూలిన తర్వాత మాత్రమే మంటలు ప్రారంభమయ్యాయని, ల్యాండింగ్ సమయంలో పేలుడు జరగలేదని ప్రత్యక్షసాక్షులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Air India Plane Crash: కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ
దుర్ఘటన అనంతరం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు అహ్మదాబాద్ ఆసుపత్రులకు 40 మృతదేహాలు చేరినట్లు సమాచారం. మొత్తం మృతుల సంఖ్య 100కు పైగా ఉంటుందని అనుమానిస్తున్నారు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. లండన్ వెళ్తున్న దూరమైన గమ్యం కావడంతో విమానంలో భారీగా ఇంధనం నింపారు. దీంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ప్రాణ నష్టం మరింత ఎక్కువగా నమోదైంది. ఈ ప్రమాదంలో కేవలం విమానంలోని ప్రయాణికులు కాదు..విమానం మెడికల్ కాలేజ్ భవనం పై కూలడం తో 20 మంది యువ డాక్టర్స్ చనిపోయినట్లు తెలుస్తుంది.