AAP : స్వాతి మలివాల్‌ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్‌ కుమార్‌

  • Written By:
  • Publish Date - May 29, 2024 / 03:35 PM IST

Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్‌ కుమార్‌(Bibhav Kumar) ఆప్‌ ఎంపీ స్వాతిమలివాల్‌(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్‌ కుమార్‌ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్‌ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, బిభవ్‌కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌(Bail Petition)ను దిగువ కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ గౌరవ్‌ గోయల్‌.. బిభవ్‌కుమార్‌కు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆయన తాజాగా తన అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు.

Read Also: Mirzapur : మిర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..!

ఇటివల కేజ్రీవాల్‌(Kejriwal)ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌కుమార్‌ తనపై దాడికి పాల్పడ్డాడని ఆప్‌ ఎంపీ స్వాతిమాలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బిభవ్‌ను ఈ నెల 18 అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ముందుగా ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ, తర్వాత నాలుగు రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ, మళ్లీ మూడు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది.