Bhargavastra : శత్రు డ్రోన్లపైకి ‘భార్గవాస్త్రం’.. పరీక్ష సక్సెస్.. అదిరే ఫీచర్లు

‘‘భార్గవాస్త్ర(Bhargavastra)తో మేం మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించాం. 

Published By: HashtagU Telugu Desk
Bhargavastra Counter Drone System Drone Swarm Test India Enemy Drones

Bhargavastra : శత్రువుల డ్రోన్లను తునాతునకలు చేయగల ‘భార్గవాస్త్ర’‌ను సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అతి తక్కువ ఖర్చులోనే ఈ  కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థను తయారు చేశారు. శత్రు డ్రోన్లను గురిపెట్టి ధ్వంసం చేయడానికి  ‘భార్గవాస్త్ర’‌ నుంచి మైక్రో రాకెట్లను రిలీజ్ చేస్తారు. తాజాగా ఒడిశాలోని గోపాల్‌పుర్‌లో ఉన్న సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు. ఇది అన్ని లక్ష్యాలను సక్సెస్‌ఫుల్‌గా ఛేదించిందని భారత ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు వెల్లడించారు.

Also Read :Turkey Army In Pak : 400 డ్రోన్లతో మిలిటరీని కూడా పాక్‌కు పంపిన టర్కీ

మూడు ట్రయల్స్ ఇలా జరిగాయి.. 

‘‘భార్గవాస్త్ర(Bhargavastra)తో మేం మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించాం.  తొలి రెండు ట్రయల్స్‌లో ఒక్కో రాకెట్‌ చొప్పున పెట్టి టెస్ట్ చేశాం. మూడోసారి నిర్వహించిన ట్రయల్‌లో రెండు రాకెట్లను ఒకేసారి 2 సెకన్ల వ్యవధిలో పేల్చాం. మూడు ట్రయల్స్‌లోనూ ఈ రాకెట్లు శత్రు డ్రోన్లను విజయవంతంగా ధ్వంసం చేశాయి’’ అని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి.

Also Read :Rohit Sharma : రోహిత్ రాజకీయాల్లోకి వస్తున్నారా ? సీఎంతో భేటీ అందుకేనా?

భార్గవాస్త్రలో ఉన్న ఫీచర్లు

  • శత్రు డ్రోన్లు గరిష్ఠంగా 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండగానే భార్గవాస్త్ర గుర్తించగలదు.
  • శత్రు డ్రోన్‌ను గుర్తించగానే దానికి గురిపెట్టి చిన్నసైజు రాకెట్లను భార్గవాస్త్ర వదులుతుంది. ఈ రాకెట్లు వెళ్లి డ్రోన్లను తాకి ధ్వంసం చేస్తాయి.
  • భార్గవాస్త్ర డిఫెన్స్ సిస్టమ్‌లో రాడార్‌ వ్యవస్థ ఉంది. ఇది గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను కూడా పసిగట్టగలదు.
  • భార్గవాస్త్ర డిఫెన్స్ సిస్టమ్‌ శత్రు డ్రోన్లపై దాడి చేయడానికి రెండు అంచెల వ్యవస్థను అనుసరిస్తుంది.  మొదటి అంచెలో ‘అన్‌గైడెడ్‌ మైక్రో రాకెట్ల’ను శత్రు డ్రోన్లపైకి వదులుతారు. రెండో అంచెలో 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల గుంపుపైకి  ‘గైడెడ్ మైక్రో రాకెట్ల’ను వదులుతారు.
  • అన్ గైడెడ్ మైక్రో రాకెట్లు శత్రు డ్రోన్లను తాకే విషయంలో అంతగా కచ్చితత్వం ఉండదు. అందుకే రెండో అంచెలో  గైడెడ్ మైక్రో రాకెట్లను వినియోగిస్తున్నారు. గైడెడ్ మైక్రో రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో శత్రు డ్రోన్‌ను తాకుతాయి.
  • సముద్రానికి 5000 మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో, కొండ ప్రాంతాల్లో భార్గవాస్త్ర డిఫెన్స్ సిస్టమ్‌ బాగా పనికొస్తుంది.
  • చిన్నసైజులో ఉన్న డ్రోన్లను, డ్రోన్ల గుంపును ధ్వంసం చేయడానికి భార్గవాస్త్ర బాగా పనికొస్తుంది.
  Last Updated: 14 May 2025, 05:15 PM IST