Site icon HashtagU Telugu

Nasal Vaccine: జనవరి 26 నుంచి అందుబాటులోకి నాసల్ వ్యాక్సిన్.. ధర ఎంతంటే..?

Nasal Vaccine

Resizeimagesize (1280 X 720) (3) 11zon

భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త తెలిపింది. తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ (iNCOVACC)ని భారతదేశంలో జనవరి 26న విడుదల చేస్తామని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ప్రకటించారు. భారత్ బయోటెక్ ఇంట్రాసనల్ కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి ఒక్కో డోసుకు రూ.325 చొప్పున విక్రయిస్తుండగా, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలకు రూ.800కు విక్రయిస్తామని గత డిసెంబర్ లోనే వెల్లడించారు.

భారతదేశంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి నాసికా వ్యాక్సిన్ జనవరి 26న విడుదల కానుంది. భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కి iNCOVACC అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల ధృవీకరించారు. భోపాల్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. భారతదేశంలో లంపి స్కిన్ డిసీజ్‌కు వ్యాక్సిన్‌ను కూడా త్వరలో సిద్ధం చేయబోతున్నట్లు చెప్పారు. దీనికి Lumpi-ProVacInd అని పేరు పెట్టారు. వచ్చే నెలలోగా దీన్ని ప్రారంభించవచ్చని ఆయన భావిస్తున్నారు.

Also Read: Central Govt: ట్విటర్, యూట్యూబ్‌లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!

భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఐఐఎస్‌ఎఫ్ సెగ్మెంట్ ‘ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్’లో పాల్గొన్న ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. మా నాసికా వ్యాక్సిన్‌ను జనవరి 26న అంటే రిపబ్లిక్ డే నాడు లాంఛనంగా లాంచ్ చేస్తున్నామన్నారు. భారత్ బయోటెక్ ఇంట్రాసనల్ కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రభుత్వానికి ఒక్కో డోసుకు రూ.325 చొప్పున విక్రయిస్తుండగా, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలకు రూ.800కు విక్రయిస్తామని గత డిసెంబర్ లోనే వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్ ను 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే తీసుకోవాలి. 12 నుండి 17 సంవత్సరాల పిల్లలకు కూడా టీకాలు వేస్తున్నారు. కానీ వారికి పూర్తి డోస్ ఇవ్వరు. రెండవ విషయం ఏమిటంటే.. ఇది బూస్టర్ డోస్ గా పని చేస్తుంది. అంటే..రెండు డోస్‌లు తీసుకున్న వారు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ని పొందగలరు.