Site icon HashtagU Telugu

Tram Service : కోల్‌కతా ట్రామ్‌లు ఇక కనిపించవు.. దీదీ సర్కారు కీలక నిర్ణయం

Tram Service Kolkata West Bengal

Tram Service : ట్రైన్స్ కాదు ట్రామ్స్.. ఇవి బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఫేమస్. వీటికి 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. కోల్‌కతా వారసత్వ సంపదలో భాగంగా మారిన ట్రామ్స్ (రెండు బోగీల మినీ రైలుబండ్లు) సేవలను ఇక ఆపేయాలని మమతా బెనర్జీ సర్కారు నిర్ణయించింది. ఈవివరాలను బెంగాల్ రవాణా మంత్రి స్నేహాశీస్‌ చక్రబర్తి వెల్లడించారు. కోల్‌కతాలోని మైదాన్‌- ఎస్‌ప్లనేడ్‌ మార్గంలో కొంతకాలం పాటు ట్రామ్‌ల సేవలను కంటిన్యూ చేస్తామని తెలిపారు.

Also Read :Ex IPS officer Vs Ex Army chief : మాజీ ఐపీఎస్ నాగేశ్వర రావు వర్సెస్ మాజీ ఆర్మీ చీఫ్.. ఆ ఘటనపై ట్వీట్ వార్

ట్రామ్స్ సేవలను(Tram Service) ఇంతకీ ఎందుకు ఆపేస్తున్నారు ? అంటే..  కోల్‌కతా నగర రోడ్లపై ఇప్పుడు ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది. ఈక్రమంలో రోడ్లపై నుంచి నెమ్మదిగా రాకపోకలు సాగించే ట్రామ్‌ల వల్ల ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. దీనివల్ల వాహనదారుల రాకపోకలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించే ఉద్దేశంతో ట్రామ్ సర్వీసులను ఆపేయాలని బెంగాల్ సర్కారు నిర్ణయించింది.

Also Read :Pulwama Accused Dies: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి