Kejriwal Bail Live: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. సుప్రీం తీరుపై ఆప్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులకు ఇప్పటికే సుప్రీం బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్ (Kejriwal) బెయిల్ అంశంపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం(Delhi liquor scam) లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ అరెస్ట్, బెయిల్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5న ఈ కేసుపై వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ లభిస్తే.. ఈడీ మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందినందున ఆయన జైలు నుంచి బయట పడతారు. జూన్ 26న సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్నాడు.
కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించి బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని కోరింది. ఈ రెండు ఉత్తర్వులను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సీబీఐ అరెస్టు చట్ట విరుద్ధమని, తనను విడుదల చేసి బెయిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అరెస్టుపై ప్రశ్నలు లేవనెత్తారు మరియు సీఆర్పిసి (CrPC) సెక్షన్ 41A ప్రకారం, విచారణ నోటీసు పంపకుండా నేరుగా అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని వాదించారు. సుప్రీం బెయిల్ తీరుపై ఉత్కంఠ నెలకొంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం కోసం మేము ఎదురుచూస్తున్నామని చెప్పారు.
Also Read: Better Sleep: నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీకోసమే..!