Babu Jagjivan Ram : ఇవాళ (ఏప్రిల్ 5) ప్రముఖ జాతీయ నాయకుడు, సామాజిక పోరాట యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి. ఆయన్ను అందరూ బాబూజీ అని పిలిచేవారు. బాబూ జగ్జీవన్ రామ్ ప్రజాజీవితంతో ముడిపడిన కీలక అంశాలను ఓసారి తెలుసుకుందాం..
Also Read :Tamilisai : తమిళనాడు బీజేపీ చీఫ్ రేసులో తమిళిసై.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే
బాబూ జగ్జీవన్ రామ్ గురించి..
- బిహార్‌లోని చాంద్వాలో ఒక దళిత కుటుంబంలో బాబూ జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న జన్మించారు.
- 28 సంవత్సరాల వయసులో బిహార్ శాసన మండలికి ఆయనను నామినేట్ చేశారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది.
- అంటరానివారికి సమానత్వం, హక్కుల కోసం 1935లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్‌ను స్థాపించడంలో బాబూజీ కీలక పాత్ర పోషించారు.
- 1946లో జవహర్‌లాల్ నెహ్రూ మొదటి మంత్రివర్గంలో అతి పిన్న వయస్కుడైన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్.
- 1971 ఇండో-పాక్ యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా బాబూజీ పనిచేశారు. ఈ యుద్ధం తర్వాతే పాకిస్తాన్ భూభాగం చీలిపోయి బంగ్లాదేశ్ ఏర్పాటైంది.
Also Read :Lucknow Super Giants: చివరి బంతి వరకు ఉత్కంఠ.. లక్నోపై పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్!
- ఎమర్జెన్సీ (1975–77) సమయంలో బాబూజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి మద్దతు ఇచ్చారు. అయితే ఆ తరువాత 1977లో కాంగ్రెస్‌ను వీడి తన కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీతో పాటు జనతా దళ్ పార్టీ కూటమిలో చేరారు.
- 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ పార్టీ కూటమి గెలిచింది. ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది. జనతా దళ్ కూటమికి 298 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 189 సీట్లకు పరిమితమైంది.
- జనతా దళ్ కూటమి ప్రభుత్వంలో భారత ఉప ప్రధానమంత్రిగా (1977–79) బాబూజీకి అవకాశం లభించింది.
- ‘‘బాబూజీ(Babu Jagjivan Ram) ఎందుకలా చేశారో నాకు అస్సలు అర్థం కాలేదు. జనతాదళ్‌లో చేరుతారనే ఆయన నిర్ణయం తెలుసుకొని ఆశ్చర్యపోయాను. బాబూజీ కాంగ్రెస్‌కు ఎందుకు రాజీనామా చేశారో అర్థం కాలేదు. ఎమర్జెన్సీకి సంబంధించిన ఆంక్షలన్నీ మేం క్రమంగా సడలించాం. రాజకీయ ఖైదీలను విడుదల చేశాం. ప్రెస్ సెన్సార్‌షిప్‌ను ఎత్తేశాం. అసోంలోని గువహటిలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో కూడా బాబూజీ మౌనంగా ఉన్నారు. ఏమీ చెప్పలేదు’’ అని ఆనాడు ఇందిరాగాంధీ రియాక్ట్ అయ్యారంటూ ఓపెన్ మ్యాగజైన్ పేర్కొంది.
- 1979లో జనతాదళ్ కూటమి నుంచి బాబూ జగ్జీవన్ రామ్ వైదొలిగారు. ఆ సమయానికి ఆయన దేశ రక్షణమంత్రి పదవిలో ఉన్నారు.
- 1981లో కాంగ్రెస్ (జె)ను బాబూజీ స్థాపించారు.
- 1952 నుంచి 1986 వరకు 30కిపైగా ఏళ్ల పాటు కేంద్ర కేబినెట్ మంత్రిగా బాబూజీ సుదీర్ఘ పదవీకాలం భారత చరిత్రలో సాటిలేనిది.
- 1986 జూలై 6వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ తుదిశ్వాస విడిచారు.
- ఆయన మొదటి భార్య అనారోగ్యంతో 1933 ఆగస్టులో చనిపోయింది.
- దీంతో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఇంద్రాణీ దేవిని బాబూజీ రెండో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం సురేశ్ కుమార్, మీరా కుమార్.
- మీరా కుమార్.. 2009లో లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్‌గా ఎంపికయ్యారు.