Site icon HashtagU Telugu

Baba Ramdev: గంగానదిలో స్పీడుగా ఈతకొట్టిన బాబా రాందేవ్.. ఎందుకంటే..

Baba Ramdev Swim Ganges River Ganga River Haridwar

Baba Ramdev: బాబా రాందేవ్ .. యోగా గురువు. ఆయన యోగాలో వరల్డ్ ఫేమస్. ఇవాళ రాందేవ్ స్విమ్మర్‌గా మారారు. అత్యంత వేగంతో స్విమ్మింగ్ చేశారు. అందరితో భళా అనిపించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో హర్ కీ పౌరి వద్దనున్న గంగా నది ఇందుకు వేదికగా నిలిచింది. తొలుత గంగమ్మకు నమస్కరించి ఈ స్నాన ఘాట్‌లోకి దూకిన బాబా రాందేవ్ కొన్ని సెకన్లలోనే ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు చేరుకున్నారు. పుణ్య స్నానం చేసిన తర్వాత, బాబా రామ్‌దేవ్ శివలింగంపై నీరు పోసి, గంగా మాతను కీర్తించారు. ఇక ఈత కొట్టే క్రమంలో బాబా రాందేవ్ వెంట, ఒక పోలీసు సిబ్బంది కూడా రక్షణగా వెళ్లాడు. స్థానికంగా పతంజలి విశ్వవిద్యాలయానికి చెందిన సెంట్రల్ సంస్కృత వర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడానికి హర్ కి పౌరికి రాందేవ్ బాబా(Baba Ramdev) వచ్చారు.  రాందేవ్ ఈతకొడుతుండగా పెద్దసంఖ్యలో జనం గుమిగూడి చూశారు.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాందేవ్ బాబా తరచుగా వివిధ రకాల ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లను స్వీకరిస్తూ కనిపిస్తారు.59 సంవత్సరాల వయస్సులో కూడా బాబా రాందేవ్ స్విమ్మింగ్ లాంటి వాటిలో అద్భుతమైన ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు.  ఈ ఉత్సాహం వెనుక దాగిన రహస్యాలు ఆయన క్రమశిక్షణాయుత జీవితం, యోగాభ్యాసం.

Also Read :Rajya Sabha : ఒక్క రాజ్యసభ సీటు.. రేసులో ఇద్దరు కీలక నేతలు

రాందేవ్ బాబా ఏమన్నారంటే.. 

రాందేవ్ బాబా మాట్లాడుతూ.. ‘‘గంగానదిని చూడగానే నేను బాల్య జ్ఞాపకాలలో మునిగిపోయాను.  అకస్మాత్తుగా గంగానదిలోకి దూకాను. ఈత కొట్టాను’’ అని ఆయన చెప్పారు. ‘‘గ్రంథాలు అంటే కేవలం పదాలు కాదు. అవి అమృతం లాంటి జ్ఞానం. వేదాలు, గ్రంథాలు మన జీవితంలోని అతి ముఖ్యమైన అంశాలు. అవి భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, ఆయుర్వేదం, యోగా ప్రచారాన్ని మా యూనివర్సిటీ వేగవంతం చేస్తోంది’’ అని రాందేవ్ తెలిపారు.

Also Read :Miss World 2025: తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ఏ రోజు ఏం జరుగుతుంది ?